
వామ్మో సొరంగం.. ఎక్కడ బయట పడిందో తెలుసా?
ఇది బ్రిటిషర్ల కాలంనాటి చరిత్ర కలిగిన సొరంగం అంటూ శాసనసభ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ చెప్పుకొచ్చారు. బ్రిటిష్ హయాంలోనే సొరంగం ఉపయోగించి ఉంటారు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 1993లో తాను ఎమ్మెల్యే అయిన సమయంలో ఇక ఈ సొరంగం గురించి ఎన్నో సార్లు విన్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ నుంచి అటు ఎర్రకోట వరకు ఈ సొరంగం ఉంటుంది అని మాట్లాడుకునేవారు. అప్పట్లో దేశాన్ని పాలించిన బ్రిటీషు వారు ఏకంగా స్వాతంత్ర సమరయోధులను తరలించడం కోసం రహస్య సొరంగ మార్గాన్ని ఉపయోగించేవారు అని ఎన్నో కథలు ప్రచారంలో కూడా ఉన్నాయి అంటూ స్పీకర్ రామ్ నివాస్ గోయిల్ చెప్పుకొచ్చారు.
1912లో కోల్కతా నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తమ రాజధాని ఢిల్లీకి మార్చింది. ఆ సమయంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ భవనం ఉపయోగించేవారు. 1926లో దీనినే కోర్టు భాగంగా మార్చారట. స్వాతంత్ర సమరయోధులను కోర్టుకు తీసుకువచ్చేందుకు ఎలాంటి అపాయం తలెత్తకుండా ఈ రహస్య సొరంగ మార్గాన్ని వాడేవారు అంటూ చెప్పుకొచ్చారు స్పీకర్. సొరంగ మార్గం పైన ఎన్నో మెట్రో ప్రాజెక్టులు డ్రైనేజీ వ్యవస్థలూ నిర్మాణం కావడం వల్ల ఈ సొరంగ మార్గం మొత్తం మూసుకుపోయిందని ఇక ఇప్పుడు మళ్లీ ఈ సొరంగ మార్గాన్ని తవ్వాలి అనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.