వైసీపీ ఇన్ని మిస్టేక్స్ చేసిందా..ఇలా ఎక్కడా జరగదు...

M N Amaleswara rao
జగన్ ప్రభుత్వం తప్పులు మీద తప్పులు చేసి కోర్టులో బుక్ అయిపోతుందా..? న్యాయ వ్యవస్థలో ఉండే లాజిక్‌లతో ప్రతిపక్ష టి‌డి‌పి...వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుందా? అంటే ఏది ఎలా జరిగిన చివరికి బుక్ అయ్యేది జగన్ ప్రభుత్వమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వీటిల్లో చాలా నిర్ణయాలు వివాదాస్పదమయ్యి, అవి కోర్టుకు వెళ్ళాయి. ఇక జగన్ తీసుకున్న నిర్ణయాలకు కోర్టులో మొట్టికాయలు కూడా పడ్డాయి.

ఇప్పటివరకు చాలా అంశాల్లో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు గానీ, సుప్రీం కోర్టుగానీ మొట్టికాయలు వేసింది. ఒకటి, రెండు అని కాదు వందకు పైనే అంశాల్లో జగన్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి. ఇక తాజాగా కూడా జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై..ఇన్‌సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. దీనిపై దమ్మాలపాటి కోర్టుకెళ్లారు.

ఈ క్రమంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది. ఇక దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. అక్కడ కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడా జరగలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. అలాగే ఈ కేసుని నెల రోజుల్లోనే పూర్తి చేయాలని హైకోర్టుని ఆదేశించింది. ఈ క్రమంలోనే హైకోర్టు దమ్మాలపాటితో పాటు మరికొందరిపై పెట్టిన కేసులని కొట్టేసింది. అలాగే ఆయనపై నమోదైన ఎఫ్‌ఐ‌ఆర్‌ని కూడా రద్దు చేసేసింది.

ఇలా ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఈ ఒక్క అంశమనే కాదు...చాలా వాటిల్లో ప్రభుత్వానికి షాకులు తగిలాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వేసే రాంగ్ స్టెప్‌లు వల్లే ఇలాంటి తీర్పులు వస్తున్నాయని, ఇది పూర్తిగా జగన్ ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుందని, అసలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని సార్లు మొట్టికాయలు తిని ఉండదని విశ్లేషకులు మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: