ప్రజల హృదయాన్ని గెలిచిన రాజశేఖరుడు...

VAMSI

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి మరియు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా బేధం ఉంది. ప్రజలు మారకున్నా నాయకులు మరియు నాయకత్వం అంతా మారిపోయింది. ఇలాంటి సమయంలో అంతకు ముందు సీఎంగా ఉన్న వారిలో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వచ్చినంత పేరు ఎవ్వరికీ వచ్చి ఉండదు. ఇప్పటి వరకు ఎంతో మంది సీఎంలు రాష్ట్రాన్ని పాలించినా వారందరికన్నా మిన్నగానే రాజన్న పాలన సాగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా వరకు ప్రజల క్షేమమే పరమావధిగా భావించి తీసుకునే నిర్ణయాలు రాజన్నకు ఎంతో మంచి పేరును తీసుకువచ్చాయి. ప్రజలు కూడా వైఎస్ఆర్ పాలనలో ప్రజలంతా అయిదు సంవత్సరాల పాటు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకోవడంలో వైఎస్ఆర్ పాత్ర చాలా కీలకమైనది.
వైఎస్ఆర్ ఒకటే ఉద్దేశ్యంతో సీఎంగా గద్దెనెక్కాడు. ప్రజలకు ఏమి కావాలో, ఏమి అవసరమో అది వారికి అందించడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. ఈ రోజు ఎంతో మంది పేద విద్యార్థులు ఇంజినీరింగ్ మరియు డాక్టర్స్ చదివి ఎంతో పెద్ద పెద్ద స్థాయిలో స్థిరపడ్డారు అంటే దానికి కారణం వైఎస్ తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకమే. ఈ పథకమే లేకుంటే ఈ రోజు పేదవాడు పదవ తరగతి వరకు లేదా ఇంటర్ వరకు చదువుకుని ఆపేసేవారు. కానీ ఈ పథకం వలన ప్రతి పేదవాడికి గొప్ప గొప్ప చదువులు చదువుకునే అవకాశాన్ని రాజన్న కల్పించారు. దీనికి ఎంతో మంది తల్లితండ్రులు ఎన్ని జన్మలెత్తినా ఆయనకు రుణపడి ఉంటారు.
అందుకే ప్రజలు రాజన్న తరువాత ఇంత కన్నా ఎవ్వరూ మమ్మల్ని చూసుకోలేరు అనే గట్టి నమ్మకానికి వచ్చారు. ఈ రోజుకీ ఆయన స్వర్గస్తులై 12 వసంతాలు పూర్తి అయినా ప్రజలందరి మనసులో ఇంకా సజీవంగానే ఉన్నారు ఉంటారు. మళ్లీ ఎన్ని యుగాలు గడిచినా ఇంత మంచి మరియు మంచి మనిషి రాడు అని అనుకుంటున్నారు. ఈ మాటలు అన్నీ ఆయన పాలన తర్వాత విసిగి వేసారిపోయిన సామాన్య ప్రజల నుండి వచ్చినవే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: