జ‌గ‌న్ అంటే సీఎం : కొలువుల కోలాహ‌లం ఎన్న‌డో?

RATNA KISHORE
రాష్ట్రంలో ఉద్యోగాలు సంబంధించి నోటిఫికేషన్ల జారీ లో వైయస్సార్సీపి ప్రభుత్వం అలసత్వం వహిస్తున్న విమర్శలు రోజు రోజుకి తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇ ఉద్యోగుల కోరికలు తీర్చడం లోనూ అదేవిధంగా నిరుద్యోగుల ఆశల ను, ఆశయాలను నెరవేర్చడంలో ఎందుకనో వెనుకంజ వేస్తున్నారు అన్న విమర్శ ఒక‌టి వాస్తవ రూపం దాలుస్తోంది. ఈ క్రమంలో వై ఎస్ ఆర్ సి పి కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది .


వాస్తవానికి నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు ఇస్తామని కొలువుల భర్తీ లో సామరస్యపూర్వక చర్యలు తీసుకుంటామని నాటి పాదయాత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక నాటి హామీ లన్నీ మరిచిపోయి ఆయన ప్రవర్తిస్తున్నారు అన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. షెడ్యూల్ ప్రకారం అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రలోనూ జరగడం లేదు అని విపక్షాలు ఆరోపిస్తున్న వి. ఇదే ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాలలో అనివార్యమై ఉంది.



అటు తెలంగాణ ఉద్యోగ కమిషన్ కానీ ఇటు ఆంధ్ర ఉద్యోగ కమిషన్ కానీ త్వరితగతిన ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు అందుకని నోటిఫికేషన్ల జారీ లో వేగవంతమైన చొరవ తీసుకోవాలి. ఇదే సంద‌ర్భంలో ఉద్యోగాల భర్తీలో సకాలంలో సంబంధిత ప్రకటనల జారీలో అటు జగన్ ఇటు తెలంగాణ సీఎం చూపుతున్న చొరవ ఏ మాత్రం అంగీకారయోగ్యం కాదు. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్లు తీసుకువస్తామని వైసిపి చెబుతు న్న అవాస్తవ సంబంధ ప్రకటనలు కేవలం సాక్షి మీడియాకు లేదా సానుకూల వర్గాలకు సంతోషాన్నిఇవ్వ‌వ‌చ్చు కానీ కొలువుల భర్తీ లో ఏపీ ప్రభుత్వం ఎన్నడూ లేనంత నిర్లక్ష్యం ఉండడంతో తరుచు విమర్శలకు తావిచ్చేలా ఉంటోంది. ఈ తరుణంలో ఆగస్టు నెలాఖరులో గా ప్రకటన కావలసినటువంటి నోటిఫికేషన్లు ఇప్పటికీ రాలేదన్న వాస్తవం ఇవాళ ప్రధాన మీడియాలో క‌థ‌న రూపాన వెలుగుచూసింది. దీనిపై వైసీపీ ఏ విధంగా స్పందించినా స‌రే! ఒకింత శ్ర‌ద్ధ వ‌హించి కొత్త కొలువుల భ‌ర్తీకి చొర‌వ చూపితేనే నాలుగు కాలాల పాటు ఈ ప్ర‌భుత్వ మ‌నుగ‌డ అన్న‌ది నూరు పైస‌ల నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: