తెలంగాణలో ఎన్నికలు రావడానికి ఇంకా రెండు సంవత్సరాల పైనే సమయం ఉంది. కానీ ఇప్పటి నుండే అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు సమాయత్తం అవుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై ఒకింత ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ అంశాన్ని ఇతర రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అయితే
కేసీఆర్ లాంటి
మహా నాయకుడిని ఎదుర్కోవాలంటే అంత సులభం కాదు. అందుకోసం ఈ మధ్యనే తెలంగాణలో రాజన్న రాజకీయ వారసురాలిగా
షర్మిల వైఎస్సార్ టిపీ ని స్థాపించిన విషయం తెలిసిందే.
పార్టీ పెట్టక ముందు నుండి అధికార పార్టీపై విమర్శలు చేసిన షర్మిల... తన ఉద్దేశ్యం ఏమిటో చాటిచెప్పింది.
ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో
కేసీఆర్ ను గద్దె దించడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటి నుండే ప్రభుత్వం హామీలను ఇచ్చి నిలబెట్టుకోవడంలో విఫలమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిర్ణయించుకుంది.
అందులో భాగంగానే తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం దీక్షను చేపడుతోంది. ఈ రోజు సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ లో తన దీక్షను చేపట్టనుంది. అంతే కాకుండా ఎన్నికల వ్యూహాలలో భాగంగా కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
అయితే ఆ పొత్తు కూడా
కేసీఆర్ తో ఇప్పటి వరకు కలవని పార్టీలతో అయితే బంధం దృఢంగా ఉంటుందని భావించి బహుజన సమాజ్ వాది
పార్టీ తెలంగాణ కో ఆర్డినేటర్ గా వున్న ఆర్ ఎస్
ప్రవీణ్ కుమార్ మరియు
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం లను కలుపుకుని ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ జన సమితి
పార్టీ అధ్యక్షుడయిన కోదండరాం మంచి ఉద్యమ భావాలున్న నాయకుడు కావడం షర్మిలకు కలిసొచ్చే అంశం. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ రెండు పార్టీలతో పొత్తు విషయం గురించి
షర్మిల అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరి ఏమి జరగనుందో రానున్న రోజుల్లో తెలియనుంది.