అస్తికల కోసం గొడవ.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
హిందూ సాంప్రదాయం ప్రకారం అస్తికలను ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు అందరూ. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని అస్తికలను పవిత్ర ప్రాంతంలో ఖననం చేస్తే ఇక అతని ఆత్మకు శాంతి చేకూరుతుంది అని భావిస్తూ ఉంటారు. అందుకే ఒక వ్యక్తి ఎలా చనిపోయినప్పటికీ అతని అస్థికలను మాత్రం సాంప్రదాయం ప్రకారం ఖననం చేయాలి అని భావిస్తూ ఉంటారు.  అయితే ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు ఇక బంధుమిత్రులు అందరూ అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. అతని మృతదేహానికి స్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు.  ఈ క్రమంలోనే అతని అస్తికలను తీసుకోవాలి అని అనుకున్నారు కుటుంబ సభ్యులు.



 ఇక అతని అస్థికలను పవిత్ర గంగాజలం లో కలిపితే అతని ఆత్మకు శాంతి చేకూరుతుంది అని అనుకున్నారు. ఈ క్రమంలోనే కాటికాపరిగా పని చేస్తున్న వ్యక్తిని అస్తికలు తీసి ఇవ్వాలి అని చెప్పారు. కానీ అక్కడ జరిగిన ఘటన తెలిసి మాత్రం ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఒకే దహన వేదికపై ఏకంగా ఇద్దరు మృతదేహాలను దహనం చేశాడు కాటికాపరి. దీంతో అస్తికలు ఎవరు తీసుకోవాలి అనేదానిపై రెండు కుటుంబాల మధ్య  స్మశానవాటికలో చిన్నపాటి వివాదం నెలకొంది. ఏకంగా కాటికాపరి చేసిన చిన్న పొరపాటు ఇరు కుటుంబాలను కూడా అయోమయంలో పడేసింది ఈ ఘటన జగిత్యాలలో వెలుగులోకి వచ్చింది.



 జగిత్యాల జిల్లా చింతకుంట  ప్రాంతానికి చెందిన పోచమ్మ అనే మహిళ ఇటీవలే అనారోగ్యం బారిన పడి మృతి చెందింది ఇక ఆమెను స్థానిక స్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఇక అదే రోజు భీమయ్య అనే వ్యక్తి కూడా చనిపోవడంతో అతని మృతదేహాన్ని కూడా అదే దహన వేదికపై అంత్యక్రియలు చేశారు. దీంతో ఇక ఆస్తికలు ఎవరు తీసుకోవాలి అనే దానిపై రెండు కుటుంబాల మధ్య అయోమయం ఏర్పడింది . ఇక చివరికి ఇరు కుటుంబాలు కూడా ఒక ఒప్పందానికి వచ్చి తలో కొన్ని అస్తికలు తీసుకుని వెళ్ళిపోయారు.  ఈ ఘటన కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: