రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్.. ఇక పార్టీ నాశనం?
కెసిఆర్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే పొంతనలేని హామీలు ఇస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలను అయోమయంలో పడేస్తున్నారు అని.. ఇక అలాంటి కోవలోకే వచ్చిందే రానున్న 20 ఏళ్ల పాటు టిఆర్ఎస్ దే అధికారం అన్న హామీ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కెసిఆర్ ను చూస్తేనే టీఆర్ఎస్ నేతలు భయపడిపోతున్నారు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇక రేవంత్ కామెంట్స్ పై స్పందించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రేవంత్ ను తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తప్పుడు మాటలు మాట్లాడితే నాలుక కోస్థాం అంటూ వార్నింగ్ సైతం ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ అని ఆయన ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ నాశనం అవుతుంది అంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు దగ్గర చప్రాసిగా రేవంత్ రెడ్డి పని చేసి ఆయనను ఏపీకి పంపించేశారని ఏద్దేవా చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ హెచ్చరించారు. వచ్చే 25 ఏళ్లు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని అసంతృప్తితో రేవంత్ అలా మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు చేశారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే.