అలాంటి చిన్నారులందరికీ త్వరగా అందనున్న టీకా..?
2022 సంవత్సరం మొదటి త్రైమాసికంలోపు పూర్తి ఆరోగ్యవంతమైన పిల్లలందరికీ టీకా ఇవ్వనున్నట్లు అరోరా తెలిపారు. కొ-మొర్బిడిటీల సమస్యలు ఉన్న పిల్లలలో కొత్త వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది కాబట్టి వారికి తొందరలోనే వ్యాక్సిన్లు వేస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం, భారత ప్రభుత్వం 12 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ఒక టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. ఈ టీకా అక్టోబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని అరోరా తెలిపారు. ప్రస్తుతం 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలపై కొవాగ్జిన్ టీకా పనితీరును పరిశీలిస్తున్నామని.. ఇది అక్టోబర్ చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని వ్యాఖ్యానించారు.
ఇండియాలో 12-17 ఏళ్ల వయస్సు లోపు ఉన్న చిన్నారులు 12 కోట్ల మంది ఉన్నారని.. వారిలో కేవలం 1% మంది మాత్రమే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని అరోరా పేర్కొన్నారు. ఈ పిల్లల అందరి కోసం ఒక జాబితా తయారు చేస్తామని వెల్లడించారు. 2 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలు 44 కోట్ల మంది ఉన్నారని వారందరికీ వ్యాక్సిన్ చేయడం పెద్ద సవాలేనని అన్నారు.