కరోనా కట్టడికి కేసీఆర్ కీలక నిర్ణయం ఫలిస్తుందా ?

VAMSI
కరోనా మహమ్మారి ని తరిమి కొట్టడానికి ప్రపంచ దేశాలు గత రెండేళ్ల నుండి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కరోనా మాత్రం ఇంచు కూడా కదలనంటూ మనల్ని హింసిస్తోంది. అయినా సరే కరోనాకు చెక్ పెట్టడానికి మన ప్రయత్నం మాత్రం కొనసాగుతూనే ఉంది. కరోనాను అరికట్టడానికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ  శరవేగంగా జరుగుతోంది.

తాజాగా తెలంగాణ సర్కారు వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి హైదరాబాద్ పట్టణంలో  డోర్ టు డోర్ వెళ్లి మరీ ప్రజలకు వ్యాక్సిన్లు వేయబోతున్నారు. ఈ రకంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి అనే వారికి కాస్త సమయం మిగులుతుంది. అలాగే, శ్రమ తగ్గుతుంది. ఏదేమైనా ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేయడం ద్వారా తీసుకునే వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది.


ఈ విధంగా చేయడం వలన ఎవరైనా వ్యాక్సిన్ వద్దు అనుకునే వారికి తమ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉందని అధికారులు అనుకుంటున్నారు. తద్వారా కరోనా భారీగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 30,948 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,24,234 కి చేరింది. ఇక  దేశంలో కరోనాతో కొత్తగా 403 మంది  బాధితులు మరణించారు. ప్రపంచ దేశాల్లో కరోనా మరణాల శాతం 2.09 శాతంగా ఉండగా భారతదేశంలో మరణాల రేటు 1.3 శాతంగా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. తాజాగా 38,487 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 


ఇక కరోనా వ్యాప్తి విషయానికొస్తే తొమ్మిది రోజులుగా కరోనా సోకుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ వ్యాక్సిన్ కార్యక్రమం పట్ల దేశం నలుమూలల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ కార్యక్రమం సజావుగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు అధికారులు. మరి కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: