హూ ఆర్ యూ : ఇంతకూ కేటీఆర్ ఎవరు ? షర్మిల ఎవరు?

RATNA KISHORE
అపరిపక్వ ధోరణిలో నాయకులు మాట్లాడకూడదు. పార్టీ ఆరంభం నుంచి షర్మిల చేస్తున్నదే ఇది. అన్ని పార్టీల నేతలూ మాకు శత్రువులే అని చెప్పడం ఇంకా విడ్డూరం. కేసీఆర్ ను టార్గెట్ చేసేటప్పుడు ఆమె చెప్పిన మాటలకు సహేతుకత లేదు. అవి కేవ లం రాజకీయ ఆరోపణలే అనుకున్నా అవి కూడా సరిగా లేవు. అంటే ఆరోపణల్లో స్పష్టత కానీ లేదా ఒక కారణాన్ని వెలుగులోకి తెచ్చే విధానం కానీ లేదా సమస్యల తీవ్రతను వివరించే విధానం కానీ అస్సలు బాలేవు. నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి కానీ ఆ త్మహత్యలు ఏ స్థాయిలో ఉన్నాయి..అన్నది ఆమె చెప్పగలిగారా పోనీ వైఎస్సార్టీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది ఏ తరహా పరి ష్కారం ఇస్తుంది అన్నది కానీ ఆమె వివరించగలిగారా అంటే అదీ లేదు. కేవలం కేసీఆర్ ను టార్గెట్ చేసి నాలుగు విమర్శలు చేయ డంలో అర్థం లేదు. షర్మిలలో ఈ అపరిక్వత కారణంగా ఓ విధంగా ఆమె కు ఉన్న అవగాహన రాహిత్యం కారణంగా తొలి ప్రసంగం ఎంతో  పేలవంగా ఉంది. ప్రాజెక్టులపై కూడా ఆమెకు అవగాహన అంతంత మాత్రమే. పొరుగున ఉన్న సీఎం ఎవరు? ఆమె అన్నగా రే కదా! మరి! అలాంటప్పుడు చేసే వ్యాఖ్యలు అయినా బాగుండాలి. అసలు ఇంతటి అపరిపక్వతతో ఉన్న వారంతా పార్టీలు పెట్టి ఏం సాధిస్తారు. తెలంగాణ అంటే నాకు తెలుసు అని చెప్పడం సులువు కానీ ఆ సుదీర్ఘ చరిత్రలో భాగం కావడం అన్నది కష్టం. కేసీ ఆర్ కాదు కేటీఆర్ కాదు ఇంతకూ షర్మిల ఎవరు? ఈ మాటే ప్రశ్నిద్దాం. ఆ పని రాజకీయ నాయకులు ఎందుకనో చేయడం లేదు. బహుశా! మహిళ కదా ఎందుకని ఊరుకుంటున్నారేమో! ఆ పాటి సానుభూతి ఉంటే పర్లేదు కానీ నిర్మాణాత్మక విమర్శలకు మిగ తా నాయకులు ఎందుకనో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

 

తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భావం తరువాత కొన్ని మాటలు వినిపించాయి. షర్మిల తొలి ప్రెస్మీట్ అందుకు కారణం అయింది. విలే కరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా కేటీఆర్ ఎవరు అని ఎదురు ప్రశ్నించారు. ఇంతకూ కేటీఆర్ ఎవరు? పోనీ ఈ తగాదా ఎందు కు షర్మిల ఎవరు ? రాజ్యంలో అధికార సాధనే ధ్యేయంగా మున్ముందుకు అడుగులు వేసే నాయకులకు ఎవరేంటో తెలియకుండా నే రాజకీయాలు చేయడం విడ్డూరం. ఈ నేపథ్యంలో ఇంంతకూ వైఎస్సార్టీపీ ఎందుకు అని ప్రశ్నిస్తే.. విడిపోయిన ప్రాంతంలో కొత్త పార్టీ వచ్చి ఏం చేస్తుంది.?




కేటీఆర్ ఎవరు..తెలంగాణ మంత్రి. ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు. ఈ రెండూ కాకుండా ఆయన బాగా చదువుకున్న వాడు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న లీడర్..మరి! షర్మిల..ఇంకా ఆరంభంలో ఉన్న పార్టీకి నేత. సరైన క్రియాశీలక నిర్ణయాలు లేని పా ర్టీకి అధినేత్రి. కొంత కాలం జగనన్న పార్టీకి అండగా నిలిచిన నేత. ఇంకా చెప్పాలంటే తెలంగాణతో అస్సలు సంబంధం లేని నేత. ఆ మె  పార్టీ ఆరంభించి ఇక్కడ నేతలను ప్రశ్నిస్తూ పోతే బాగుండు. కానీ అలా కాకుండా ఆమె చెప్పిన మొదటి మాటే అనేక వివాదా లకు కారణం అయింది. టీఆర్ ఎస్ ట్రోల్ చేసింది అందుకే. అయినా కూడా ఆమె తగ్గలేదు. మొన్న కేసీఆర్ పుట్టిన్రోజున కూడా ఏ వో ట్వీట్లు చేశారు. నిరుద్యోగ సమస్యలు దమ్ముంటే పరిష్కరించాలని సవాల్ చేశారు. చేస్తూనే కొన్ని పేపర్ క్లిప్పింగులు యాడ్ చే శారు. ఈ పరిణామంతో వివాదం ఇంకా వేడెక్కిపోయింది. ఇవన్నీ అపరిపక్వ ధోరణులే. నిరుద్యోగ దీక్ష పేరిట ఆమే చేస్తున్న హడా వుడి కూడా తెలంగాణ సమాజం పట్టించుకుంటుందా అంటే అనుమానమే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: