తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?
ఇక ఈ ఘటనలో పెద్ద పెద్ద తీవ్ర వాదులు సైతం బయటకు వచ్చినట్లు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్లో జైలు బద్దలు కొట్టిన ఘటన తర్వాత కేరళలో రోదనలు మొదలైనట్లు తెలుస్తోంది. అదేంటి ఆప్ఘనిస్థాన్లో జైలు బద్దలు కావడానికి కేరళకూ ఏంటి సంబంధం అని అవాక్కవుతున్నారు కదా.. దీని వెనుక పెద్ద స్టోరీ ఉంది. కేరళకు చెందిన దాదాపు 20 మంది యువతులు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన యువకులను ప్రేమించి వారిని పెళ్లి చేసుకుని ఏకంగా వారి మతాన్ని కూడా మార్చుకున్నారట. ఇక ఆ యువకులతో ఆఫ్ఘనిస్థాన్ వెళ్లి అక్కడే ఉండిపోయారట.
కేరళకు చెందిన నిమిషా అనే యువతి డెంటల్ డాక్టర్ గా పనిచేసింది. తిరువనంతపురానికి చెందిన బిందు - సంపత్ ల కూతురు ఈ యువతి. ఆఫ్ఘనిస్తాన్ కి అబ్బాయిని ప్రేమించి పెద్దలు ఒప్పోకోకపోయినప్పటికి అతన్ని పెళ్లిచేసుకుని ఇక మతం కూడా మారి తన పేరును ఫాతిమ గా మార్చుకొందట. 2016లో భర్తతో కలిసి అఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉగ్రవాదులతో కలిసింది. ఉగ్రవాదులకు ఒక వారసున్ని కూడా ఇచ్చింది. తర్వాత కాలంలో భారత కాల్పుల్లో చనిపోవడంతో ఇక ఈ యువతి బిడ్డతో సహా ప్రభుత్వానికి లొంగి పోయిందట. ఆ సమయంలో అక్కడి ప్రభుత్వం ఈమెని జైల్లో పెట్టింది. ఇక ఇటీవలే జైలు బద్దలు కొట్టిన వ్యవహారం తర్వాత ఆ యువతి తల్లి మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు పద్దెనిమిది వందల కుపైగా విజ్ఞప్తులు పంపాను. తమ కూతురు ఉగ్రవాది కాదని.. భారత్ తీసుకురావాలి అంటూ ఆ యువతి తల్లి విజ్ఞప్తి చేశారు. ఇలా కేరళ నుంచి 20 మంది యువతులు ఆఫ్ఘనిస్తాన్ వెళ్లినట్లు ప్రస్తుతం లెక్కలు బయట పడుతున్నాయి.