తాలిబన్ల అరాచకం.. యూకే గొప్ప మనసు?

praveen
మమ్మల్ని కాపాడండి మహాప్రభో అంటూ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల హాహా కారాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.  మాపై కాస్తయినా జాలి చూపి మమ్మల్ని అక్కున చేర్చుకోండి అంటూ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అన్ని దేశాలను వేడుకుంటున్నారు. ఏ క్షణం లో ప్రాణాలు పోతాయో అన్నది తెలియ కుండా అను క్షణం భయ పడుతూ బతుకు తున్నారు  అక్కడి ప్రజలు. ఇటీవలే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో ఆధిపత్యాన్ని సాధించడమే దీనికి కారణం. మరి కొన్ని రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధ మవుతున్నారు తాలిబన్లు.




 అయితే ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని దశాబ్దాల కిందట ఇదే విధం గా తాలిబన్లు తమ ఆధిపత్యం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో తాలిబన్ల పాలన మొత్తం అఫ్ఘనిస్తాన్ ప్రజలందరికీ పీడకల లాంటిదే అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. దీంతో మళ్లీ ఇప్పుడు తాలిబన్ల ఆధిపత్యం సాధించి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం లో ప్రజలు అందరూ వణికి పోతున్నారు. ఈ క్రమం లోనే దేశం నుంచి పారి పోయేందుకు ప్రయత్నిస్తున్నారు.  ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న ఎంతో మంది శర ణార్థులకు వివిధ దేశాలు అక్కున చేర్చుకుంటున్నాయ్.




 ప్రస్తుతం తాలిబన్ల అరాచకాలకు భయ పడి ఎంతో మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు ఇక ఇతర దేశాలకు పారి పోతున్నారు. ఇలాంటి సమయం లో ఇటీవలే యూకే గొప్ప మనసు చాటుకుంది. ఏకంగా ఆఫ్ఘనిస్తాన్  శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తాము అంటూ ఇటీవల ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇలా శరణార్థులు కోసం ప్రత్యేకం గా ఆఫ్ఘన్ సిటీజన్స్ రీ సెటిల్మెంట్ స్కీమ్ ను కూడా ప్రవేశ పెట్టినట్లు చెప్పు కొచ్చింది. ఇక యూకే పౌరులు కూడా ఆఫ్ఘనిస్తాన్ శరణార్ధులను తమ ఇళ్లల్లో కి అనుమతి ఇస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Uk

సంబంధిత వార్తలు: