రైతు వెత: రైతుల ఇక్కట్లు... అన్నీ ఇన్నీ కావు ?

VAMSI
దేశానికి అన్నం పెట్టే ధాత రైతన్న. ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మారుతున్న కాలానికి తగినట్లుగా మనుషుల ఆలోచనలో మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు 'రైతే రారాజు', ఇప్పుడు కూడా రారాజే కానీ పేరుకు మాత్రమే 'రైతే పేద' అనే నానుడికి తెచ్చారు మన పాలక ప్రభుత్వాలు. ఇప్పుడు ఎవరైనా వ్యవసాయం పల్లెటూరు అంటే, 'ఎవ్వరూ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయం చేస్తే ఆత్మహత్యలే శరణ్యమా ? అన్న దీనమైన స్థితికి చేరుకుంది మన గొప్ప భారతదేశం. రైతన్నకు అన్నం దొరికే పరిస్థితులు రోజురోజుకీ సన్నగిల్లిపోతున్నాయి. మన ఆంధ్ర ప్రదేశ్ లో రైతన్నల పరిస్థితి ఒకసారి చూస్తే అర్ధమవుతుంది ఎంత ఇబ్బందులు పడుతున్నారో ?
అధికారంలోకి వస్తారు. ఎన్నో హామీలను ఇస్తారు. బడ్జెట్ కేటాయింపులు అంటారు. అందులో లక్షల కోట్లు దాని కోసం కేటాయిస్తారు. కానీ రైతన్నకు ఆ కేటాయింపులు దక్కుతున్నాయా? అంటే లేదనే సమాధానం చాలా నోర్ల వెంట వినిపించే పరిస్థితి. దాదాపు నెలల కాలం పాటు ఒక చిన్న బిడ్డలుగా వేసిన పంటను రాత్రి పగలు తేడా లేకుండా కస్టపడి పండిస్తే తీరా పంట కోసే సమయానికి ప్రకృతి కన్నెర్ర చేసి వరదలతో ముంచెత్తుతుంది. ఆ సమయంలోనూ మంత్రులు అధికారులు అంతా వచ్చి, వరద సాయం ఇస్తామని హామీలిస్తారు. ఇక అంతే, మళ్ళీ ఆ డబ్బులు రైతులు పొందాలంటే ఎన్ని రోజులు ఇబ్బందులు పడాలో, ఎంతమంది కాళ్ళ మీద పడాలో ఆ దేవుడికెరుక.

 పంట పండించడానికి స్థోమత లేక బ్యాంకులో అప్పు కోసం వెళితే, అక్కడా జాప్యమే. ఇస్తామంటారు పేపర్లు సరిగా లేవంటారు. ఆఖరికి పైసలు చేతికొచ్చేలోపు పంట వేయాల్సిన కాలం కూడా అయిపోతుంది. పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల పేరిట ప్రభుత్వానికి అమ్ముకునే మంచి పథకం తెచ్చారు. బాగుంది కానీ ధాన్యం ప్రభుత్వానికిచ్చి నెలలు గడుస్తున్నా పైసలివ్వకుంటే ఎలా బతకాలే అంటూ రైతు కన్నీరు పెడుతుండు. ఈ విధంగా రైతు అనేక విధాలుగా ఇబ్బందులను ఎదొర్కొంటున్నాడు. ఈ విషయాలనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కారం జరగడం లేదని రైతుల వేదన. అధికారులు సీఎం దృష్టికి రైతుల సమస్యలను తీసుకెళ్తున్నారా లేదో అని రైతాంగం విలపిస్తోంది. సీఎం జగన్ ఈ విషయాలపై కూడా దృష్టి సారించి రైతన్నకు నాయయం చేకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాము.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: