
'రచ్చబండ'లో టార్గెట్ వారేనా ?
తాను చేసిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ప్రతి ఒక్కరికీ అందాయా లేదా అన్నది కూడా ఈ రచ్చబండలో తెలిసిపోతుంది. ప్రతి ఒక్క రైతును, మహిళలు మరియు పిల్లలను కలిసి వారిని అడిగి తన పాలన ఎలా ఉందో తెలుసుకుంటారట. ఈ రచ్చబండలో ఆన్ ది స్పాట్ ప్రజలు ఎటువంటి సమస్యను తన దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునున్నారని తెలుస్తోంది. ఇక రాష్ట్రమంతా ప్రతి పక్ష నాయకులు గగ్గోలు పెడుతున్న సమస్య అవినీతి వైసీపీకి చెందిన నాయకులు అయినా లేదా వైసీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు అయినా ఎటువంటి అవినీతికయినా పాలుపడినట్లు నిర్దారణ అయితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని గుసగుసలు వినబడుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుండే గ్రామ వాలంటీర్ నుండి కలెక్టర్ వరకు అందరూ సర్దుబాటు చేసుకుంటున్నట్లు తెలియవస్తోంది.
జగన్ కొత్తగా తన ప్రభుత్వంలో తీసుకువచ్చిన పెను సంచలనం గ్రామ మరియు వార్డ్ సచివాలయం యొక్క పనితీరు గురించి ప్రత్యేకంగా తెలుసుకోనున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వారి వాలంటీర్ పనితనం గురించి అడుగుతారని భోగట్టా. ముఖ్యంగా కరోనా కాలంలో వాలంటీర్ వ్యవస్థ పనితీరు బాగుందని రాష్ట్ర స్థాయిలో పేరు వచ్చిన మాట వాస్తవమే. ఏ వ్యవస్థలో మరిన్ని మార్పులు తీసుకురావాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే అత్యంత పటిష్టమైన ప్రజాసేవా వ్యవస్థగా నిలపాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. ఇప్పటి నుండే రచ్చబండ గురించి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి ఆలోచిస్తున్నారంటే దాని తీవ్రత ఏ విధంగా ఉండనుందో తెలియడం లేదు.