ఓ ఆటోవాలా.. నీకు సలాం?

praveen
మానవత్వం.. మానవత్వం అనేది ఇంకా బ్రతికే ఉందా..  ఏమో మరి నేటి రోజుల్లో మనుషుల్లో మాత్రం ఎక్కడ మానవత్వం కనిపించడం లేదు..  దాని కంతటికీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటన లే కారణం.  మరి మానవత్వం బతికి ఉందా అంటే.. మానవత్వం ఉన్నవారు చేసిన పనులను వీడియోలను మన మీడియా ఎందుకో ఎక్కువగా చూపించదు.. కానీ ఇప్పటికీ ఎంతోమంది తమలోని మానవత్వాన్ని చాటుకుంటు నేటి సభ్య సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు అన్న విషయం కొన్ని సంఘటనలు చూస్తే అర్థం అవుతూ ఉంటుంది.



 ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఇంకా మానవత్వం అందరిలో బ్రతికే ఉంది అనిపిస్తుంది. ఇక్కడ ఓ ఆటోవాలా తనలోని మానవత్వాన్ని చాటుకుని సమాజంలో సరికొత్త స్ఫూర్తి నింపాడు.  నేను ఒక సాదా సీదా ఆటోవాలా కావచ్చు..  ధనవంతుల తో పోల్చి చూస్తే నేను తక్కువ స్థాయి కావచ్చు.. కానీ ఇలా పేదరికంలో పుట్టినందుకు నేను ఎప్పుడూ దేవున్ని తిట్టుకోలేదు ఎందుకు అంటారా నాకు దేవుడు ధనం ఇవ్వకపోవచ్చు.. కానీ సంపద కంటే ఎక్కువ ప్రతి మనిషిలో ఉండాల్సిన మానవత్వాన్ని ఒక గొప్ప  మనసును మాత్రం ఇచ్చాడు.  ఇది ఆ ఆటోవాలా మనసులోని మాట.



 మామూలుగా నేటి సమాజంలో ఆటోవాలా అంటే అందరూ కాస్త చులకనగా చూస్తూ ఉంటారు. కానీ ఇటీవలే అదే ఆటోవాలా చేసిన పని తెలిస్తే మాత్రం సలాం కొడతారు  ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆటో డ్రైవర్ ఏకంగా అవయవదానంతో ఏడుగురికి పునర్జన్మ ఇచ్చాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే 34 ఏళ్ల వ్యక్తి పేద వాడే ఇక బతుకుదెరువుకోసం ఆటో నడుపుతాడు. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఇటీవల ఐసీయూలో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచాడు. ఈ క్రమంలోనే ఇక అతని కుటుంబ సభ్యులు అతని యొక్క గుండె, మూత్రపిండాలు, కాలేయం, రెండు కార్నియాలు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారికి అందించాలని భావించారు. దీంతో ఏడుగురికి అతని అవయవాలు అందించి ఏకంగా వారికి పునర్జన్మ ఇచ్చాడు ఆటోవాలా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: