అమరావతి : హాకీ ప్లేయర్ రజనీ కి భారీ నజరానా ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. హాకీ ప్లేయర్ రజనీ కి రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించడమే గాక.. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రభుత్వం ఉద్యోగం కలిపించనుంది జగన్ సర్కార్. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్. జగన్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్. జగన్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్ లో విశేష ప్ర తిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి . రజనీ కి శుభాకాంక్షలు తెలిపారు.
రూ. 25 లక్షల నగదు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నామని పేర్కొన్నారు సిఎం జగన్. క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎం జగన్ ను తన తల్లిదండ్రులతో కలిసి కలుసుకున్నారు హాకీ ప్లేయర్ రజనీ. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్యపతక పోరువరకూ కూడా భారత మహిళల జట్టు దూసు కెళ్లిందని.. జట్టు విజయాల్లో రజనీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు సిఎం జగన్. గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి, పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు సిఎం జగన్.
తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు జగన్. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలంపిక్స్ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని సిఎం జగన్ కోరారు. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్‌తో పాటు టోక్యో ఒలంపిక్స్ 2020 లో కూడా పాల్గొన్న క్రీడాకారిణి గా రజనీ రికార్డ్ సృష్టించిందని చెప్పారు. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం గ్రామానికి చెందిన రజనీ... 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్‌లలో పాల్గొని ప్రతిభ కనబరించింది.