పాలించమంటే.. పరువు తీస్తున్నారు?

praveen
సాధారణంగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు కంటే.. పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నికైనా ఎంపీల కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి వారి మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు అంటారా.. రాష్ట్రానికి కావాల్సిన నిధులను రాబట్టుకోవాలి అన్న  రాష్ట్రం యొక్క పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలన్నా..  ఇక కేంద్రం దగ్గర ఏదైనా కొట్లాడి సాధించుకోవాలి అన్నా ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు తోనే సాధ్యం అవుతుంది. ఇక పార్లమెంటు వేదికకు ఎన్నికవ్వటం అంటే జాతీయ స్థాయిలో రాష్ట్రాల సత్తా చూపించడం కోసమే.



 రాష్ట్రానికి ఏం కావాలి అనే దానిపై పార్లమెంటులో అవగాహన కూడిన పోరాటం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చేస్తున్నది మాత్రం ప్రస్తుతం పార్లమెంట్ ముందు ఏపీ పరువు తీస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రానికి కావాల్సిన  వాటి గురించి పోరాటం చేయడం కంటే ఢిల్లీలో పార్లమెంటు దగ్గర ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాష్ట్రం పరిధిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఏపీలోని రెండు పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.



 ఒకరిమీద ఒకరు కేంద్రానికి కంప్లైంట్ చేసుకోవడం అంతేకాకుండా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం దగ్గర నిలబడి నిరసనలు చేయడం లాంటివి చేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఒకే పార్టీలోని ఎంపీలు కూడా ఇలా ఢిల్లీ వేదికగా ఒకరికి వ్యతిరేకంగా ఒకరూ నిరసనలు తెలుపుతున్నారు. ఇలా రాష్ట్రం కోసం పోరాడటం మానేసి ఏకంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేయడానికే సరిపోతుంది ఏపీ పార్లమెంట్ సభ్యులకు.  దీంతో నార్త్ కు సంబంధించిన ఎంపీలందరూ  ఆంధ్ర ఎంపీలను చూసి నవ్వుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఇలా జాతీయ వేదిక పైన రాష్ట్ర సత్తా ఏంటో చాటాల్సింది పోయి.. నిరసనలు ఆందోళనలు అని కాలం గడుపుతున్నారని పాలన కోసం ఎన్నుకుంటే చివరికి రాష్ట్రం పరువు తీస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: