గుడ్ న్యూస్: అయోధ్య రామమందిరాన్ని తెరిచేది అప్పుడే ?
అయితే దశల వారీగా ఈ నిర్మాణములు పూర్తి చేయడానికి ప్రణాళికలు చేసిన సంగతి తెలిసిందే. వీరు చెబుతున్నట్లుగా 2023 సంవత్సరం చివరి నాటికి రామ మందిరం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ అలాగే గర్భ గృహంలోని అయిదు మండపాలు మాత్రమే పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇవి కాకుండా ఆలయంలోని రాళ్లు, ఆలయ కాంప్లెక్స్ కు సంబంధించిన పనులన్నీ కూడా 2025 వరకు కొనసాగుతాయని అధికారిక సమాచారం. ఈ మందిర పునాదులను కాంక్రీట్ తో నింపే పనులు సగం పూర్తయినట్లు చెబుతున్నారు. కేవలం ఈ పునాదుల పని పూర్తి కావడానికి ఇంకో రెండు నెలల సమయం పడుతుందని అంచనా. ఈ ఆలయాన్ని 110 ఎకరాల విస్తీర్ణములో నిర్మిస్తున్నారు.
ఇందులో కొత్త రకపు డిజిటల్ మ్యూజియం, డిజిటల్ ఆర్చీవ్స్, భక్తులు ఉండడానికి ప్రదేశం, మంచి ఆడిటోరియం లు మరియు పాలనా భవనాలు, పూజారులకు ప్రత్యేక గృహ సముదాయాలు నెలకొల్పుతున్నారు. ఇందులో మొదటి అంతస్థులో... మూడు అంతస్తులు మరియు రామ్ దర్బార్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ కి అయ్యే ఖర్చు సుమారుగా 1000 కోట్లు కానున్నట్లు సమాచారం. కానీ ఇందు కోసం సేకరించిన విరాళాలు 3000 కోట్లు ఉన్నాయట. సరిగ్గా ఈ రోజుకి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని మొదలుపెట్టి సంవత్సరం అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పరిశీలించనున్నారు.