ఈ-రూపీ గురించి ఎవరికి తెలియని వివరాలు ఇవే..!

Suma Kallamadi
నేటి సమాజం టెక్నాలజీ వైపు ముందుకు సాగుతోంది. భారత దేశం కూడా నూతన టెక్నాలజీతో సరికొత్తగా దూసుకుపోతోంది. తాజాగా ఇండియా ట్రాన్సాక్షన్ల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ సరికొత్త విధానానికిి బాటలు వేసింది. ఈ రూపీ అనే సరికొత్త పేమెంట్ వ్యవస్థను రెడీ చేసింది. లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన ఈ రూపీ వ్యవస్థను ఆగస్టు 2వ తేది నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ను స్వయానా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇప్పుడున్నటువంటి అనేక క్యాష్ లెస్ డిజిటల్ పేమెంట్ వ్యవస్థలకు భిన్నంగా ఇది ఉండనుంది. ఈ రూపీ యాప్ ద్వారా సులభంగా క్యాష్ లెస్, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్లను చేయొచ్చు. ఈ-రూపీ ట్రాన్సాక్షన్ లో నగదు చెల్లింపులను క్యూర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎమ్మెస్‌ స్ట్రింగ్‌ వోచర్‌ల ద్వారా మనం అనుకున్న వాళ్లకు మొబైల్‌ ఫోన్‌ ద్వారా పంపించవచ్చు. ఇప్పుడు డిజిటల్ ప్రెమెంట్స్ యాప్స్ చేస్తున్న విధంగానే ఇందులో కూడా పేమెంట్లు పంపించుకోవచ్చు. ఈ వోచర్‌, క్యూఆర్‌ కోడ్‌ను తమకు అవసరమైన చోట ఉపయోగించుకుని ట్రాన్సాక్షన్లు చేయవచ్చు.

ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా పేర్కొంది. ఈ వోచర్లు ఈ-గిఫ్ట్ కార్డులు వంటివి ఈ రూపీలో ఉంటాయి. ఒకవేళ మనం మెడిసిన్ కొనడానికి ఈ-రూపీ వోచర్లను కనుక తీసుకన్నట్లైతే ఆ వోచర్లను మెడిసిన్ కొనడానికి వినియోగించాల్సి ఉంటుంది. తమకు అవసరమైన పేమెంట్లు మొత్తం కూడా వోచర్ల ద్వారానే సాగుతాయి. మనం ట్రాన్సాక్షన్లను చేయడానికి వారికి వోచర్ ఎస్ఎంఎస్ లేదా స్కాన్ వంటివి చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేనివారు వోచర్ కోడ్ ఎస్ఎంఎస్ చేసి తమ ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. బ్యాంకు అకౌంట్ లేదా డిజిటల్ పేమెంట్ యాప్, స్మార్ట్ ఫోన్ లేకపోయినప్పటికీ ఈ వోచర్ల ద్వారా ట్రాన్సాక్షన్లను చేయొచ్చు. ఈ వోచర్లను మనం ఎక్కువగా ఆరోగ్య సంబంధిత ట్రాన్సాక్షన్ల కోసమే వినియోగించవచ్చు. ఇటువంటి వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ ఉమ్మడి సహకారంతో   ప్రజల ముందుకి తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: