ఇప్పటికే ఎక్కువైంది.. ఇక ఖాళీ చేయండి.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్?

praveen
పాక్ ఆక్రమిత కాశ్మీర్.. సుదీర్ఘకాలం నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య ఈ భూభాగం గురించి ఎన్నో సార్లు చర్చలు జరిగాయి. ఇంకా ఎన్నో సార్లు ఘర్షణలు కూడా జరిగాయి. భారత దేశంలో ఒక భాగంగా ఉన్న కాశ్మీర్ ప్రాంతాన్ని కొంతమేర ఆక్రమించుకుంది పాకిస్తాన్. ఇక దానిని  ఆజాది కాశ్మీర్ అని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలుస్తూ ఉంటుంది. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను  భారత్ లో మళ్లీ కలుపుకోవాలని ఇక భారత ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే యుద్ధం రూపంలో కాకుండా సామరస్యంగా చర్చల ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను మళ్లీ భారత్లో కలుపుకోవాలని భావిస్తుంది భారత ప్రభుత్వం.



 కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అటు పాకిస్థాన్ ప్రభుత్వం మరో వైపు ఉగ్రవాద సంస్థలు మాత్రం ఎప్పుడూ భారత్ ను రెచ్చగొట్టే విధంగా వివిధ రకాల చర్యలు చేపడుతూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల ఏకంగా పాకిస్తాన్ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్ విభాగంలో అధికారికంగా ఎన్నికలు నిర్వహించడం సంచలనంగా మారిపోయింది. అయితే మొదట్లోనే ఈ ఎన్నికలు నిర్వహించడం పై  అంటూ భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ వినిపించుకోని పాకిస్థాన్ ప్రభుత్వం ఆక్రమిత కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. దీంతో ఇటీవలే భారత ప్రభుత్వం పాకిస్థాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.



 ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం ఎన్నికలు జరపాలి అనుకుంటున్న కాశ్మీర్ భూభాగం భారత దేశం కి చెందింది అని వెంటనే ఇక పాకిస్తాన్ ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఖాళీ చేయాలంటూ ఇటీవలే చట్టబద్ధమైన హెచ్చరికలు జారీ చేసింది భారత ప్రభుత్వం. మీది కానీ భూభాగంలో మీరు అసలు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు అంటూ పాకిస్తాన్ ను ప్రశ్నించింది. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒక స్వతంత్ర దేశం అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రపంచాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించ వద్దు అంటూ  భారత్ హెచ్చరించింది. భారత రాజ్యాంగం ప్రకారం భారత్లో అంతర్లీనమైన భూభాగాన్ని చొరబడి ఆక్రమించుకుని.. ఇప్పుడు ఎన్నికలు  కూడా నిర్వహిస్తున్నారు వెంటనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కాళీ చేయాలి అంటు హెచ్చరికలు జారీ చేసింది భారత్. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: