టీడీపీకి అండగా కాంగ్రెస్...రాహుల్‌ని సెట్ చేయడానికా?
కానీ ఉమ్మడి ఏపీ విభజన తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దెబ్బతింది. ఏపీలో అయితే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా వైసీపీ వచ్చింది. అసలు ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. అయితే మారిన రాజకీయాల నేపథ్యంలో 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.
ఇక 2019 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జతకట్టారు. కానీ ఏపీలో మాత్రం ఒంటరిగానే బరిలో దిగారు. ఇక రెండువైపుల బాబు ఘోరంగా విఫలమయ్యారు. ఏపీలో అధికారం కోల్పోయాక చంద్రబాబు మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ పరోక్షంగా ఏపీలో కాంగ్రెస్, చంద్రబాబుకు మద్ధతుగానే నడుచుకుంటున్నట్లు కనిపించింది. ఆ పార్టీ నాయకులు జగన్‌ని టార్గెట్ చేస్తూ, టీడీపీ పోరాటాలకు మద్ధతుగా ఉంటూ వస్తున్నారు. తాజాగా దేవినేని ఉమా అరెస్ట్ విషయంలో కూడా కాంగ్రెస్ నేతలు టీడీపీకి సపోర్ట్‌గా నిలబడుతున్నారు.
అదే సమయంలో జగన్ ప్రభుత్వంపై గట్టిగానే ఫైర్ అవుతున్నారు. ఈ పరిణామాలని చూస్తే నెక్స్ట్ ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌లు పొత్తు ఉంటుందా? అంటే అసలు ఉండదనే చెప్పొచ్చు. మరి ఎందుకు కాంగ్రెస్ నేతలు, టీడీపీకి అనుకూలంగా ఉన్నారంటే, నెక్స్ట్ జాతీయ స్థాయిలో రాహుల్‌కు చంద్రబాబు సపోర్ట్ దక్కాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇలా టీడీపీకి అనుకూలంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మోదీకు అనుకూల ఫలితాలు రావని, ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీల మద్ధతు పెంచుకుంటే నెక్స్ట్ రాహుల్‌కు ఉపయోగపడుతుందనే కోణంలో కాంగ్రెస్ నేతలు ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో?