అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు
అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు చేస్తుంది. కరోనా మహమ్మారి భయంతో.. గత ఏడాది కంటే భక్తులు తక్కువే ఉన్నారని అధికారులు అంటున్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. అలాగే ఎలాంటి అనుచిత ఘటనలు చోటు చేసుకోకుండా..సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసరాల్లో ఏకంగా 200 సీసీ కెమెరాలతో ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టింది పోలీస్ శాఖ. అలాగే ఆలయానికి చుట్టూ కిలో మీటర్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తోంది. అటు బోనాలతో వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు ఏర్పాటు చేశారు భక్తులు.
ఇది ఇలా ఉండగా.. తెలంగాణలో ప్రతి ఏటా బోనాల వేడుకలు ప్రసిద్ధి చెందిన లష్కర్ బోనాల వేడుకలకు సర్వం సిద్దం చేశారు అధికారులు. వివిధ శాఖ అధికారులు ఈ మేరకు పూర్తి సమన్వయంతో అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. కాగా ఇవాళ ఉదయం అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు.ఉదయం నుంచి అమ్మ వారికి బోనాలు సమర్పిందుకు భక్తులు వస్తూనే ఉన్నారు. కోవిడ్ నేపధ్యంలో గతంతో పోలిస్తే కొంత ఖాళీగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ 10 గంటల తరువాత భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.