ఏడాదికి 100 రోజులు సెలవులు.. కేంద్ర కీలక నిర్ణయం?
ఏ క్షణంలో శత్రువుల దాడి జరుగుతుందో అని భావించి నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈ క్రమంలోనే కుటుంబానికి దూరంగా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమవుతూ ఉంటారు సైనికులు. అయితే ఇటీవల కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో సాయుధ బలగాలకు ప్రతి ఏడాది 100 రోజులపాటు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవులు ఇవ్వాలని ప్రతిపాదనపై ఇటీవలే హోంమంత్రిత్వ శాఖ నివేదిక కోరడం గమనార్హం. దేశ రక్షణ కోసం సమస్యాత్మక భూభాగాల్లో క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా దేశానికి రక్షణ కల్పిస్తున్నారు సైనికులు. వారికి కాస్త ఉపశమనం కలిగించాలానే ఉద్దేశంతోనే వంద రోజులు సెలవులు మంజూరు చేయాలని ప్రతిపాదించడం గమనార్హం.
ఇక ఈ అంశానికి సంబంధించిన సాఫ్ట్వేర్ రూపకల్పన పనులు ఎంత వరకు వచ్చాయి అన్న విషయంపై ఇటీవలే హోం మంత్రి అమిత్ షా నివేదిక కోరారు. దాదాపు పది లక్షల మందితో ప్రస్తుతం భారత సాయుధ బలగాలు కేంద్రం ఆధీనంలో ఉన్నాయి. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ,సి ఐ ఎస్ ఎఫ్, ఎస్ ఎస్ బి, అస్సాం రైఫిల్స్ వంటి విభాగాలు ఉన్నాయి. అయితే ఎన్నో రోజులనుంచి క్లిష్ట పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న ఎంతో మంది సైనికులకు కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వందరోజుల సెలవులతో ఎంతగానో ఉపశమనం పొందనున్నారు భారత సాయుధ బలగాల లోని సైనికులు.