
నాతో సెల్ఫీ కావాలంటే 100 కట్టాల్సిందే.. మంత్రి షాకింగ్ ప్రకటన?
ఇక రాజకీయ నాయకులు ఇక జనాలు నిరాశ చెందకూడదు అనే ఉద్దేశంతో ఎంతో ఓపికగా సెల్ఫీ ఇస్తూ ఉంటారు అన్నది తెలిసిందే. అయితే ఇలా సెల్ఫీ ఇచ్చినందుకు ఎవరూ ఏమీ డబ్బులు ఆశించరు. కానీ ఇక్కడో మంత్రి మాత్రం ఏకంగా తన తో సెల్ఫీ తీసుకోవాలంటే ₹100 చెల్లించాల్సిందే అంటూ ప్రకటన చేసి సంచలనం సృష్టించింది. ఇక ఇటీవలే మంత్రి పెట్టిన షరతు తో అందరూ అవాక్కవుతున్నారు. ఎవరైనా తనతో సెల్ఫీ తీసుకోవడానికి వచ్చారు అంటే ముందుగా వంద రూపాయలు చెల్లించి ఆ తర్వాత సెల్ఫీ తీసుకోవాలి అంటూ సదరు మహిళా మంత్రి ప్రకటించింది. ఆ మంత్రి ఎవరో కాదు మధ్యప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఉష ఠాగూర్.
ఇటీవలే ఖాండ్వా లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె సెల్ఫీల కోసం ఎంతో మంది అడుగుతూ ఉండడం వల్ల ఎన్నో కార్యక్రమాలలో హాజరయ్యేందుకు ఆలస్యం జరుగుతుంది. అందుకే ఇక సెల్ఫీ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ వంద రూపాయలు ఇవ్వాల్సిందే అంటూ ప్రకటించింది. అయితే ఈ డబ్బులను ఇక స్థానిక మండల స్థాయి విభాగం ట్రెజరిలో చెల్లించాలని సూచించారు. ఇక ఇలా సెల్ఫీ తీసుకోవడానికి ఇచ్చిన వంద రూపాయలను వ్యవస్థాపక పనుల కోసం ఉపయోగిస్తామని మంత్రి ప్రకటించారు.అంతేకాదు తనను కలవడానికి ఎవరైనా వచ్చినప్పుడు పుష్పగుచ్ఛాలు కు బదులు పుస్తకాలు ఇవ్వాలి అంటూ ఆమె మీడియా సమావేశంలో కోరారు. ఏదేమైనా ఇటీవలే మంత్రి చేసిన ప్రకటన ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.