అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. ఉచితంగా 10వేలు?

praveen
వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందిస్తూ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ గా కొనసాగుతుంది అమెజాన్. ఇక ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎన్నో డిస్కౌంట్ ఆఫర్లతో ఎప్పటికప్పుడు తమ సేల్స్ ను పెంచుకుంటూ ఉంటుంది అమెజాన్. ఇక ఇటీవలే మరో అద్భుతమైన ఆఫర్ ను కస్టమర్ల కోసం సిద్ధం చేసింది. ఒకవేళ మీకు అమెజాన్ లో అకౌంట్ ఉంటే చాలు ఇక ఉచితంగా పదివేల వరకు గిఫ్ట్ వోచర్ గెలుచుకునేందుకు అవకాశాన్ని అందిస్తుంది అమెజాన్. అయితే ఈ ఆఫర్ కేవలం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి అమెజాన్ కస్టమర్లందరూ ఇక త్వర పడటం  ఎంతో బెటర్.



 జూలై 22 వరకు ప్రస్తుతం అమెజాన్ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్ పొందేందుకు అందరికీ అవకాశం ఉంది. అయితే ఒకవేళ ప్రస్తుతం అమెజాన్ అందిస్తున్న పదివేల రూపాయల గిఫ్ట్ వోచర్ పొందాలి అనుకుంటే ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వెబ్సైట్ ద్వారా హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు లోన్ శాంక్షన్ అయింది అంటే చాలు ఇక అమెజాన్ నుంచి 10000 గిఫ్ట్ వోచర్లు మీకు దక్కినట్టే ఆగస్టు 30 వరకు మీకు ఈ హోమ్ లోన్ మంజూరు అయి ఉండాలి. లేదంటే ఇక ఆఫర్ని కోల్పోతారు. ఒకవేళ ప్రస్తుతం అమెజాన్ అందిస్తున్న ఈ పదివేల వోచర్ పొందాలి అనుకుంటే జూన్ 21 నుంచి జూలై 22 లోపు ఈ హోమ్ లోన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.



 అంతే కాకుండా రెండు షరతుల  ఆధారంగా మీరు ఈ గిఫ్ట్ పొందగలరాలేదా అన్న విషయం తెలిసిపోతుంది. ఒకవేళ మీరు బజాజ్ ఫైనాన్స్ కార్డు ద్వారా 50 లక్షల వరకు హోమ్ లోన్ అప్లై చేసుకుంటే మీకు 5000 గిఫ్ట్ వోచర్లు పొందేందుకు అవకాశం ఉంటుంది. లేదా మీరు 50 లక్షల కంటే ఎక్కువ హోమ్ లో అప్లై చేసుకుంటే ఇక పది వేలు గిఫ్ట్ వోచర్ లు సొంతం చేసుకోవచ్చు. కాగా ప్రస్తుతం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో  హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 6.75% గా వర్తిస్తుంది. ప్రస్తుత మార్కెట్లో చూసుకుంటే ఇది ఒక ఆకర్షణీయమైన వడ్డీ రేటు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: