ఫేస్బుక్ ప్రాణాలు తీస్తుంది.. జో బైడెన్ షాకింగ్ కామెంట్స్?
ఈ సమయంలో అటు ప్రభుత్వాలు కూడా అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపడుతున్నాయి. అయితే ప్రభుత్వాలు ఎన్ని అవగాహన చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలు మాత్రం వ్యాక్సిన్ విషయంలో ఎన్నో అనుమానాలు అపోహలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అటు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం మాత్రం ప్రస్తుతం ప్రజలందరిలో వ్యాక్సిన్ అంటే మరింత భయాన్ని పెంచుతుంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక విధంగా ఇలా తప్పుడు ప్రచారం మాత్రం రోజురోజుకూ ఎక్కువవుతోంది.
ఇక తాజాగా ఇదే విషయంపై అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం అయిన ఫేస్ బుక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు జో బైడెన్. తప్పుడు సమాచారంతో ఫేస్బుక్ ఎంతో మంది ప్రజలను చంపేస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.. ఫేస్బుక్ లో కరోనా వాక్సిన్ పై అనవసర సమాచారం ప్రచారం జరుగుతోంది అంటూ చెప్పుకొచ్చారు. ఫేస్బుక్ లో జరిగే తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు శ్వేతసౌధం ఎంతగానో ప్రయత్నాలు చేస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. జో బైడెన్ వ్యాఖ్యలు మాత్రం ఫేస్బుక్ ఖండించింది.ప్రజలకు రక్షణ కల్పించాలని ఉద్దేశంతోనే సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నామూ అంటూ ఫేస్బుక్ బదులిచ్చింది.