పిల్లల చదువుల గురించి చెప్పాలంటే కరోనాకు మందు ఆ తర్వాత అనే చెప్పుకోవాలి. ఈ మహమ్మారి కారణంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా పాఠశాలలు మూతపడ్డాయి. కరోనా కు ముందు ఏది ఏమైనా ప్రతిరోజు
స్కూల్ ఉండేది. విద్యార్థులు
స్కూల్ కు వెళ్లే వారు. కానీ మహమ్మారి ఎంట్రీతో ఏడాదిన్నర కాలంగా
స్కూల్ ల తలుపులు మూసి ఉన్నాయి. దాంతో విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇక టెక్నాలజీ పుణ్యమా అని విద్యార్థులకు ప్రభుత్వాలు ఆన్లైన్ క్లాస్ లను నిర్వహిస్తున్నాయి. అయితే ఇది వరకు అంటే విద్యార్థులు పాఠశాలకు వెళ్లి హాయిగా కూర్చుని పాఠాలు వినే వారు. కానీ ఈ ఆన్లైన్ క్లాస్ లతో వారికి వచ్చిన సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా ఆన్లైన్ క్లాస్ లతో వచ్చిన సమస్యల్లో సిగ్నల్ సమస్య విద్యార్థులను దారుణంగా వేధిస్తోంది.
సిగ్నల్స్ కోసం ఇల్లు ఎక్కడం..చెట్లు ఎక్కడం లాంటివి కూడా చేస్తున్నారు. కాగా తాజాగా
మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం మండలం కోయగూడెం గ్రామంలో లో సిగ్నల్ సరిగ్గా లేక విద్యార్థులు ఊరిబయట ఉన్న సమాధుల వద్ద కూర్చుంటున్నారు. అక్కడ సిగ్నల్ బాగా ఉండటంతో అక్కడే కూర్చుని క్లాసులు వింటున్నారు. వినడానికి భయంగా ఉన్నా ఇదే నిజం. కోయగూడెం గ్రామంలో సిగ్నల్ సమస్య దారుణంగా ఉంది. ఏ నెట్వర్క్ అయినా సిగ్నల్ మాత్రం సరిగా ఉండటం లేదు. దాంతో విద్యార్థులు సమాధుల పై కూర్చొని పాఠాలు వినక తప్పడం లేదు. ఇక దీనిపై ఆ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమ ఊర్లో సిగ్నల్ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. అంతేకాకుండా మరికొందరు
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందని ఆ సదుపాయాన్ని త్వరగా కల్పిస్తే తమకు ఈ కష్టాలు తీరుతాయని చెబుతున్నారు. విద్యార్థులు సైతం ఇది వరకు
స్కూల్ ఉంటే ప్రతిరోజు వెళ్లడం ఇబ్బందిగా అనిపించేది అని.... కానీ ఇప్పుడు
స్కూల్ కి వెళ్లాలని ఎంతో ఆశగా ఉన్నా
స్కూల్ తెరుచుకోవడం లేదని బాధపడుతున్నారు. త్వరగా
కరోనా వెళ్లి పోతే పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలని ఎదురుచూస్తున్నట్టు చెబుతున్నారు.