ఆ కేంద్ర మంత్రుల రాకతో హుజురాబాద్ రాజకీయం మారనుందా..?

MOHAN BABU
 దేశ రాజకీయ పార్టీల చూపంతా  హుజురాబాద్ ఉప ఎన్నిక పైనే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే హుజురాబాద్ లో  ఆ ఎన్నికను బట్టే  పార్టీల  దిశానిర్దేశం, ముందు ముందు చేయాల్సిన  పనులపై  తగిన ప్రణాళిక రూపొందించు కుంటారు. ఈ ఎన్నికల్లో విజయం అనేది అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక  చాలా రసవత్తరంగా సాగుతోంది. ఏ నేత ఏ పార్టీలోకి ఎప్పుడు పోతాడో అర్థంకాని పరిస్థితిలో ఉంది.

 ఒక్కొక్క పార్టీ తమదైన శైలిలో  ప్రచారం కొనసాగిస్తోంది. అయితే టిఆర్ఎస్ పార్టీ నుంచి  వైదొలగిన  మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈటెల రాజేందర్ కు  హుజురాబాద్ కు ఎదురు లేదు అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో  ఈటల రాజేందర్ కు గట్టిపోటీ తగలనుంది అని చెప్పవచ్చు. టిఆర్ఎస్ విషయానికొస్తే  మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నుంచి పోటీ చేస్తారని  సమాచారం. కానీ కెసిఆర్ ఏ అభ్యర్థినీ పోటీలో ఉంచినా  గెలిచే విధంగా  టిఆర్ఎస్ పార్టీ  ఒక్కో గ్రామానికి ఒక్కొక్కరు చొప్పున వ్యక్తులను నియమించుకుని పూర్తి సమాచారాన్ని  తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటన్నిటి బాధ్యతలు మంత్రి హరీష్ రావు చూస్తున్నారు. ఎలాగైనా ఈటలను ఓడించాలనే లక్ష్యంతో టిఆర్ఎస్ ముందుకు వెళుతుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే  మొన్నటి వరకు  కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అనుకున్నారు. కానీ కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. అయితే హుజూరాబాద్ నియోజకవర్గం లో  కాంగ్రెస్ కూడా క్యాడర్ బాగానే ఉంది. కాబట్టి హుజురాబాద్ లో ఎవరు పోటీ లో నిలబడిన వారిని గెలిపించే బాధ్యత కొత్తగా ఎన్నికైన టిపిసిసి రేవంత్ రెడ్డిపై ఉన్నదని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్  అటు టిఆర్ఎస్ ఈ రెండు పార్టీల నడుమ బిజెపి నుంచి పోటీచేసే ఈటల రాజేందర్ ఎలా ఎదుర్కొంటారు.


ఆయన  ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే బిజెపి పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో  ప్రచారం కొరకు  కేంద్ర మంత్రులను కూడా తీసుకువస్తారని సమాచారం. కేంద్ర మంత్రులతో పాటు ఎంపీ తేజస్వి సూర్య కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే  కేంద్రమంత్రుల ప్రచారం  ఈటెల రాజేందర్ కు  ఏ మేరకు ఫలితం వస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: