సోనూసూద్‌ కోసం ఆ బాలుడు ఏం చేశాడంటే...?

Suma Kallamadi
ఆపత్కాలంలో పేద ప్రజలను ఆదుకుని రీల్ లైఫ్ విలన్ నుంచి రియల్ లైఫ్ హీరోగా మారిన సోనూసూద్ దయా హృదయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలో ఏ స్టార్ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సోనూసూద్‌ కి ఉందంటే అతిశయోక్తి కాదు. చాలా మంది ప్రజలు అతన్ని దేవుడిగా కొలుస్తున్నారు.‌ కరోనా సమయంలో చేతికి ఎముక లేకుండా దానాలు చేసిన గొప్ప దయా హృదయుడు సోనూసూద్‌ ఋణాన్ని ఎలా తీర్చుకోవాలి అంటూ చాలామంది ప్రజలు తమకు తోచిన విధంగా చేస్తున్నారు.

కొందరు ఆయన ఫోటోను ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారు. సోనూసూద్‌ ని పల్లెత్తు మాట అన్నా.. తమ కుటుంబ సభ్యులను అవమానించినట్లే ఫీల్ అయిపోయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఒక బాలుడు తాను దేవుడిలా పూజించే సోనూసూద్‌ను సినిమాలో హీరో పడుతుండగా ఆ దృశ్యాలు చూసి చలించిపోయాడు. మా దేవుడునే కొడతావా అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. చివరికి కోపం తట్టుకోలేక సినిమా ప్లే అవుతున్న టీవీ స్క్రీన్ ని ఒక్క ఉదుటన పగలగొట్టాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌ గ్రామంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాలు తెలుసుకుంటే.. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ మండలంలో వేపల సింగారంలో చడపంగు గురవయ్య, పుష్పలత నివసిస్తున్నారు. వారికి విరాట్‌ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఈ దంపతులు తమ కుమారుడితో కలిసి శుభకార్యానికి హాజరయ్యేందుకు బంధువుల ఇంటికి వెళ్లారు. వారంతా కలిసి టీవీలో సినిమా చూడటం ప్రారంభించారు. అయితే వారు చూస్తున్న సినిమాలో విలన్‌గా సోనూసూద్‌ కనిపించారు. దీంతో విరాట్ తీవ్ర ఆగ్రహానికి గురై రాయి తీసుకొని టీవీ కి గట్టిగా విసిరికొట్టాడు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఉన్నపళంగా తన కుమారుడి లో విపరీతమైన కోపం చూడటంతో ఏమైందో ఏమో అని ఆందోళనకు గురయ్యారు.

వెంటనే ఏమైందని.. టీవీ ఎందుకు పగలగొట్టావని ప్రశ్నించారు.  దీంతో ఆ బాలుడు మాట్లాడుతూ.. సినిమాలో హీరో తన కిష్టమైన సోనూసూద్‌ను కొడుతున్నాడని అందుకే కోపం వచ్చి టీవీ పగలగొట్టాలని చెప్పాడు. దీంతో అక్కడే ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అయితే దీని గురించి సోనూసూద్‌ తన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ కుర్రాడి పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: