జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే అనేక అవార్టులు సాధించిన హైదరాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు... తాజాగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల విషయంలో మరో మైలు రాయిని సాధించింది. రెండో దశ 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించడంతో క్లీన్ ఎనర్జీ గా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ రికార్డు సృష్టించింది. దీంతో GHIAL కు చెందిన మొత్తం సోలార్ విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 10 మెగావాట్లకు పెరిగింది.
తన సొంత వినియోగం కోసం జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2015 లో 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం చేసిన సంగతి తెలిసిందే. అలాగే 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 45 ఎకరాల విస్తీర్ణంలో, 30 వేలకు పైగా సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేశారు. రెండు సౌర ప్లాంట్లు అధునాతన ABB సెంట్రల్ ఇన్వర్టర్లు మరియు పాలీ క్టిస్తన్లిన్ పివి ఫ్యానల్స్ కూడా కలిగి ఉంది. ఇవి మోనో క్టిస్తన్లిన్.... సోలార్ పీవీ ప్యానల్స్ కంటే ఎక్కువ ధీటుగా వర్క్ చేస్తాయి.
ఈ అదనపు సోలార్ పవర్ కారణంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.... తెలంగాణ రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్ లో లో సంవత్సరం కాలానికి 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ తగ్గుతోంది. దీంతో ప్రతి మాసానికి అక్షరాల 90 లక్షల రూపాయలు సేవ్ అవుతుంది. ఈ సౌర విద్యుత్తు ఉత్పత్తి కారణంగా... హైదరాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు యొక్క విద్యుత్ అవసరాలు దాదాపు 50 శాతం తీరుతాయి. కార్బన్ ఫుట్ ప్రింట్ లో సుమారు 28 లక్షల కిలోల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది. అంతేకాదు ఇది 1.4 లక్షల పూర్తిగా పెరిగిన చెట్లకు సమానం. ఇది ఇలా ఉండగా... 2050 నాటికి కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గించటానికి తాము ప్రయత్నిస్తామని... దానికి తమ వంతు కృషి చేస్తామని ఎయిర్ పోర్టు సీఈఓ ప్రదీప్ పణికర్ పేర్కిన్నారు.