ఐడియా అదిరింది గురూ.. ఇక పెట్రోల్ అవసరమే లేదు?
ఇలా ఎన్నో వినూత్న ఆవిష్కరణలు తెరమీదికి వస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఒక వినూత్న ప్రయత్నం చేసాడు వాహనదారుడు. అతను ఒక మధ్యతరగతికి చెందిన సామాన్యుడు . భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు అతనికి ఎంతగానో భారంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రత్యేక వాహనాన్ని బయటకు తీయాలని భయపడిపోయాడు. కానీ వాహనానికి అలవాటు పడిన ప్రాణం కదా ఎట్టిపరిస్థితుల్లో బయటికి తీయాల్సిందే. అందుకే వినూత్నంగా ఆలోచించాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే తనలోని సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చాడు.
ఏకంగా పెట్రోల్ బైక్ ని కాస్తా ఎలక్ట్రికల్ బైక్ గా మార్చేసుకున్నారు ఇక్కడ ఒక సాదాసీదా వ్యక్తి. తెలంగాణలోని జనగామ కు చెందిన విద్యాసాగర్ ఇలాంటి ప్రయత్నం చేస్తాడు. పెట్రోల్ ధర పెరుగుదలతో విభిన్న మార్గాన్ని పెంచుకున్నాడు. తన బైకుకు ఉన్న పెట్రోల్ ఇంజన్ను తీసేసి బ్యాటరీలు మోటార్ అమర్చాడు. ఇందుకోసం పదివేల రూపాయలతో 4 బ్యాటరీలు కొనుగోలు చేసి బైకుకు బిగించాడు. ఇక 7500 రూపాయలు పెట్టి ఒక మోటార్ కూడా కొనుగోలు చేశాడు. వీటిని ఇక తన ప్రతిభతో బైకి అమర్చాడు. ఈ క్రమంలోనే పెట్రోల్ బైక్ ని కాస్త ఎలక్ట్రికల్ బైక్ గా మార్చుకున్నాడు. 5 గంటలు చార్జింగ్ చేస్తే ఈ బైక్ 50 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది అని చెబుతున్నాడు సదరు వ్యక్తి. ఇక ఇతని వినూత్నమైన ఆలోచనకు అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు.