గంగుల చంద్రబాబును ఇంకా ప్రేమిస్తున్నారా..?

MOHAN BABU
గంగుల కమలాకర్ కరీంనగర్ లోనే ఎదురులేని లీడర్ అని చెప్పవచ్చు.  ఆయన ప్రస్థానం టిడిపి నుంచి  మొదలైంది. ఇప్పటికే  కరీంనగర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన 2000 సంవత్సరంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముందుగా మున్సిపాలిటీ  కౌన్సిలర్ గా గెలుపొందారు. తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి  2009వ సంవత్సరం  టిడిపి పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత తెలంగాణ  మలిదశ ఉద్యమంలో  టీడీపీకి రాజీనామా చేసి  2013వ సంవత్స రంలో టిఆర్ఎస్ లో చేరారు. 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి  పోటీ చేసి  బండి సంజయ్ మీద గెలుపు జండా ఎగరవేశారు. తర్వాత వచ్చిన 2018 ముందస్తు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఆయనను  కెసిఆర్ తన మంత్రివర్గంలో  బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖకు మంత్రిగా పదవిని అలంకరించారు.

ఆయన  సుదీర్ఘ కాలంలో  టిడిపి పార్టీలోనే ఉండి రాజకీయాలు నేర్చుకున్నాడు అని చెప్పవచ్చు. ఆయనకు  రాజకీయ మొదటిగురువు అంటేనే  చంద్రబాబు నాయుడు. రాజకీయాలంటే తెలియని గంగుల కమలాకర్ కు  రాజకీయ భిక్ష పెట్టి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందే విధంగా కృషి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి  చంద్రబాబు నాయుడు. ఎవరికైనా  గురువు అంటే  గుర్తుండిపోతుంది. అలాగే ఈ మధ్యకాలంలో  నాయకులు  పార్టీలు మారడం  సర్వసాధారణమైంది. వాళ్లు  పార్టీలు మారిన తర్వాత  ఆ మారిన పార్టీ  స్లొగన్స్ గాని, నియమాలు గాని, ఆ పార్టీ అలవాట్లు గానీ అలవర్చుకోవడానికి సమయం కూడా పట్టవచ్చు. సుదీర్ఘ కాలం టీడీపీలో పని చేసిన గంగుల కమలాకర్ కు కొన్ని కొన్ని సభలలో  తొందరపాటులో చంద్రబాబు పేరునే ప్రస్తావిస్తారు. తర్వాత తేరుకొని  మళ్లీ కెసిఆర్ పేరును ప్రస్తావిస్తారు. అయితే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మరొకసారి నోరు జారడని చెప్పవచ్చు.

కరీంనగర్  రూరల్ జిల్లాలలో  పర్యటిస్తున్న గంగుల పల్లె ప్రగతి సభలో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి చంద్రబాబును మీరు దీవించాలని అక్కడున్న ప్రజలను అన్నారు. దీంతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి  చంద్రబాబుకి  మీరంతా దీవెనలు అందించాలని  మాట జారారు. వెంటనే మాట మార్చి  కెసిఆర్ అని చెప్పి తప్పు సరి చేసుకున్నారు గంగుల. టిడిపిని వదిలి 10 సంవత్సరాలు అయినా గంగుల గుండెల్లో  చంద్రబాబు ఉన్నారని నెటిజన్లు పలు విధాలుగా  సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: