స్కూల్ విద్యార్థులకు కండోమ్స్.. షాకింగ్ నిర్ణయం?

praveen
నాటి జనరేషన్ కి నేటి జనరేషన్ కి ఎంతో తేడా ఉంది. ఒకప్పుడు సెక్స్ అనే పదాన్ని బూతుగా చూసేవారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు శృంగారం గురించి బయటకు మాట్లాడటానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు.  అలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు అనుకునే వారు. కానీ నేటి రోజుల్లో మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు శృంగారం గురించి మాట్లాడటం కాదు ప్రతి ఒక్కరిలో శృంగారం కి సంబంధించిన అవగాహన పెరిగేందుకు ఇక అధికారులు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  కేవలం పెద్దలు మాత్రమే కాదు చిన్న పిల్లల్లో కూడా సెక్స్ ఫై అవగాహన కల్పించేందుకు..  ఇప్పటికే ఎంతోమంది అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.



 అయితే ఇండియాలో ఇప్పటికీ సెక్స్ అంటే ఒక బూతు గానే చూస్తున్నారు. కానీ ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రం సెక్స్ పై అవగాహన కల్పించేందుకు ఏకంగా ప్రభుత్వాలు సైతం సిద్ధమవుతున్నాయి. విచ్చలవిడి శృంగారం కారణంగా ఎన్నో రోగాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక  ప్రతి ఒక్కరిలో సెక్స్ ఫై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇటీవలే జపాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక అక్కడ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరిలో కూడా సెక్స్ పై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి అని నిర్ణయించుకున్నారు. అక్కడి పిల్లలు సెక్స్ పై అవగాహన లేకపోవడంతో లైంగిక వ్యాధులు, హెచ్.ఐ.వి, చిన్న వయసులోనే అవాంఛిత గర్భం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు అనే విషయాన్ని ఇటీవల జపాన్ ప్రభుత్వం గుర్తించిందట.



 ఈ క్రమంలోనే ఇక పదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సెక్స్ ఫై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పదేళ్ల వయస్సు దాటిన పిల్లలకు ఉచితంగా కండోమ్ లు అందించాలని ఇక చికాగో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది.  పిల్లల్లో లైంగిక వ్యాధుల ను తొలగించడానికి అవాంఛిత గర్భాలను తగ్గించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చికాగో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే ఇక ఈ సరి కొత్త నిబంధన ఎప్పుడో పాఠశాలల్లో అమలు కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా స్కూల్స్ మూతపడ్డాయి. దీంతో ఇక చికాగో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సూచించిన ఈ కొత్త నిబంధన అమలులోకి రాలేదు. అయితే ఇలా పిల్లలకు కండోమ్స్ ఇవ్వాలని ఆదేశం రావడంఫై మాత్రం  అటు తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: