కృష్ణపట్నం ఆనందయ్య ఎమ్మెల్సీ అవుతారా ?

VAMSI
కృష్ణపట్నం ఆనందయ్య ఈ మద్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు. పేరుకి ఈయన ఒక చిన్న ఆయుర్వేద వైద్యుడే కాని ఇపుడు పెద్ద సెలెబ్రెటీగా మారిపోయాడు. ప్రజలకు ఎంతగానో సేవలందించి ప్రజా ప్రతినిధుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. దానితో ఇంతటి ప్రజా సేవకుడికి పదవి ఇచ్చి ప్రోత్సహించండి అంటూ ప్రభుత్వానికి విన్నవించింది ఓ ప్రముఖ సంస్థ. ఇంతటి పాపులారిటి రావడానికి కారణం కరోనాకు వ్యతిరేకంగా దాన్ని అరికట్టేందుకు ఈయన తయారు చేసిన ఆయుర్వేద ఔషధమే. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ కరోనాపై బాగా పనిచేస్తుంది అంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాటిచెబుతున్నారు . ఎంతోమంది కరోనా రోగులు ఆక్షిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోయి చివరికి ఈయన వద్దకు రాగా ఆనందయ్య తను తయారు చేసిన ఔషధం వారికి అందించడంతో టక్కున లేచి ఆరోగ్యంగా కూర్చున్న సందర్భాలు చూశాం.

అంతగా ఆనందయ్య ఇపుడు దేశవ్యాప్తంగా పాపులారిటీ పెంచుకున్నారు. ఈ మద్యకాలంలో ఈ ఔషధాన్ని చెక్ చేయాలంటూ ప్రభుత్వం కొద్దిరోజులు ఆనందయ్య పంపిణీ ఆపేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అన్ని రకాలుగా పరీక్షించి ఈ మెడిసిన్ ఆమోదయోగ్యమని తెలిపి పంపిణీకి అనుమతినిచ్చింది. ఇలా ఈయన ఆంధ్రప్రదేశ్ లోనే కాక భారతదేశమంతటా కీర్తిని గడించారు. అయితే తాజాగా వెన్నెల ఫౌండేషన్‌ అనే సంస్థ  ప్రపంచాన్ని కబళించేస్తున్న కరోనాకి ఆయుర్వేద ఔషధం తయారుచేసి ప్రజలకు పంపిణీ చేస్తూ తన సేవలను స్వచ్ఛందంగా అందిస్తున్న ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది.

ఇంతటి ప్రజా సేవాగుణం కలిగిన ఆనందయ్యకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు విన్నవించింది ఈ సంస్థ. ఈ వినతిని పరిశీలించాలంటూ సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖను రాసింది గవర్నర్ కార్యాలయం. అలాగే తమ వద్దకు చేరిన వినతిని ప్రభుత్వానికి చేరవేయాలంటూ గవర్నర్ ఆదేశాల మేరకు సీఎస్‌కు లేఖ రాశారు గవర్నర్ సెక్రటరీ.. అయితే  ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. అయితే ఇలా జరిగే అవకాశం ఉందా ? ఇలా ఎప్పుడైనా జరిగిందా ? అని ప్రజలంతా ప్రభుతవం తీసుకునే నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా మంది ప్రజలు ఇస్తే మంచిదేనని అభిప్రాయపడుతున్నారు. ఆనందయ్య తాయారు చేసిన మందునే ఆపాలని చూసిన వారు ఎమ్మెల్సీ పదవి రావడంలో అడ్డుపడకుండా ఉంటారా అని కొంతమంది అంటున్నారు. మరి చూడాలి ఏమి జరగనుందో...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: