మరదలితో ప్రేమ, పెళ్లి.. అంతలోనే షాకిచ్చిన బావా?

praveen
బావ మరదలు అన్న తర్వాత పెళ్లి చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడంలో కొత్త ఏమీ ఉండదు. అయితే ఇక్కడ ఓ యువకుడు తన మరదలితో పెళ్లికి  ఓకే చెప్పేసాడు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే సొంత బావనే పెళ్లి చేసు కుంటూ ఉండటంతో ఆ యువతి పెళ్లి తర్వాత జీవితంపై కోటి ఆశలు పెట్టుకుంది. కానీ పెళ్లి మరికొన్ని రోజుల్లో జరగబోతుంది అనుకుంటున్న తరుణంలో బావ అతనిలోని మోసగాడిని బయట పెట్టాడు. నువ్వు అంత అందంగా లేవు నాకు సరిపోవు.. నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ ప్లేట్ ఫిరాయించి మరదలికి షాక్ ఇచ్చాడు.

 ఇక బావతో పెళ్లి అని ఎంతో సంబరపడి పోయిన ఆ యువతి తీవ్ర నిరాశలో మురిగిపోయింది. ఈ క్రమంలోనే కఠిన నిర్ణయం తీసుకునే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇక కుటుంబ సభ్యులు ఆ యువతిని ఆస్పత్రికి తరలించగా అదే సమయాన్ని అదునుగా తీసుకొని ఏకంగా మరో యువతితో పారిపోయాడు సదరు యువకుడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాపట్ల మండలం చిన్న బేతపూడి గ్రామానికి చెందిన ఫ్రాన్సిస్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మరదలు వరసయ్యే  యువతిని ప్రేమించాడు. ఇక వరుస కూడా కావడంతో ఇరు కుటుంబ సభ్యులు వీరిద్దరికీ పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నాడు

 ఇక వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాయి. కానీ అంతలో ఫ్రాన్సిస్ ఊహించని షాక్ ఇచ్చాడు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నువ్వు అందంగా లేవు అంటూ మరదలికి చెప్పేశాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురి అయింది. ఇక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతుంది.  ఇదే సమయాన్ని అదునుగా భావించిన బావ మరో యువతితో చివరికి ఇంటి నుంచి పారిపోయాడు  తాను ప్రేమించిన మరో యువతిని తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: