షర్మిల ప్రశ్నకు సమాధానం ఉందా జగన్.. టిడిపి నేత సూటి ప్రశ్న?
అయితే ఇటీవలే పార్టీ ఆవిర్భావ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటీవల షర్మిల చేసిన వ్యాఖ్యలనే టార్గెట్ గా చేసుకుని అటు ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలు అందరు జగన్ పై విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ ను తన ఇంటికి పిలిపించుకుని భోజనాలు పెట్టారు.. ఇద్దరు కూర్చొని ఎంతోసేపు చర్చించుకున్నారు.. ఒకరికొకరు స్వీట్లు కూడా తినిపించుకున్నారు. కానీ రెండు నిమిషాలు కూర్చొని రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదం గురించి మాత్రం మాట్లాడలేకపోయారు అంటూ వైఎస్ షర్మిల ప్రకటించారు. వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారాయ్. ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం టిడిపి నేతలు టార్గెట్ గా చేసుకొని జగన్ పై విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల షర్మిల వ్యాఖ్యలపై టిడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ స్పందిస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవలే తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదం పై ఇక సీఎం జగన్ చెల్లెలు షర్మిల అడిగిన ప్రశ్నకు జగన్ మోహన్ రెడ్డి దగ్గర సమాధానం ఉందా అంటూ ప్రశ్నించారు అనురాధ. వ్యవసాయానికి ఏం చేశారని వైయస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు దినోత్సవం కాదు సంకెళ్ళ దినోత్సవం, రైతు కన్నీటి దినోత్సవం జరపాలి అంటూ విమర్శలు చేశారు. ఇక వైసీపీ నేతలు అందరూ కూడా సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు అంటూ విమర్శలు చేశారు. జగన్ చేసిన మోసానికి ఒక చెల్లి ఢిల్లీ వీధుల్లో మరో చెల్లి ఇక తెలంగాణ వీధుల్లో పోరాడుతున్నారు అంటూ అనురాధ కీలక వ్యాఖ్యలు చేశారు.