రేవంత్‌ ఇలా టార్గెట్ అయ్యారేంటి...మైనస్ అవుతుందా?

M N Amaleswara rao
టీపీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి...తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలాగైనా కేసీఆర్ దగ్గర నుంచి అధికారాన్ని గుంజుకుంటామని రేవంత్ చెబుతున్నారు. ఇక కాంగ్రెస్‌ని బలోపేతం చేయడానికి రేవంత్ ప్రజా క్షేత్రంలోకి దిగుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇక ఇంతవరకు బాగానే ఉందిగానీ, రేవంత్ ఎంత దూకుడుగా విమర్శలు చేస్తున్నారో, అంతే స్పీడుగా కౌంటర్లు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని చెప్పి కామెంట్లు వస్తున్నాయి. టీపీసీసీ కాస్త టీటీడీపీ మాదిరిగా మారిందని కోమటిరెడ్డి లాంటి వారు మాట్లాడారు. ఇలా చంద్రబాబు పేరు చెప్పడం వల్ల రేవంత్‌కు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి.

అందుకే రేవంత్‌కు కౌంటర్లు ఇవ్వాలంటే ప్రత్యర్ధులు చంద్రబాబు పేరుని తీస్తూనే మాట్లాడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ సైతం స్పందిస్తూ, రేవంత్‌పై విమర్శలు చేశారు. గతంలో సోనియాని బలిదేవత అని మాట్లాడిన రేవంత్ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నారని, కొన్ని రోజులు పోతే చంద్రబాబుని తెలంగాణ దేవుడు అంటారేమో అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే టీపీసీసీ కాస్త టీడీపీసీసీగా మారిందని అంటున్నారని మాట్లాడారు.

ఇక ఏపీ ఎమ్మెల్యే రోజా సైతం రేవంత్‌ని టార్గెట్ చేసి మాట్లాడారు. అది కూడా చంద్రబాబు ప్రస్తావన తీసుకోస్తూ విమర్శించారు. తెలుగుదేశం కోవర్టుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, చంద్రబాబు..కేసీఆర్‌కు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసింది రేవంత్‌కి గుర్తు లేదా? అంటూ ఫైర్ అయ్యారు. అంటే రేవంత్‌ని విమర్శించాలంటే చంద్రబాబు పేరు తీసే విమర్శిస్తున్నారు.

మరి ఇలా రేవంత్‌ని టార్గెట్ చేయడం వల్ల భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని చెప్పి అక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ వచ్చింది. దాని వల్లే అక్కడ టీడీపీ కనుమరుగైంది. ఇప్పుడు చంద్రబాబు పేరు తీస్తూనే రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పుడు రేవంత్‌కు ఏ విధంగా ఇబ్బంది అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: