అమరావతి రాజధాని చంద్రబాబుకు ప్లేస్సా - మైనస్సా..?

MOHAN BABU
చంద్రబాబు నాయుడు ఆయన దేశంలోని తిరుగులేని నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే హైదరాబాదును అభివృద్ధి చేసింది కూడా ఆయనే అనే ఒక మంచి పేరు ఉన్నది. రెండు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కొత్త రాజకీయాన్ని ఆయన మొదలు పెట్టారు. అయితే చంద్ర బాబు 2014 అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఆయనకు  వచ్చే ఎన్నికల్లో అనేక ఇబ్బందులు తెచ్చి పెడతుందని  చెప్పవచ్చు. రాజధాని విషయమే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేయనుండటంతో చంద్రబాబు నాయుడులో తెలియని కలవరం నెలకొందని చెప్పవచ్చు. ఇందులో ప్రధాన పాత్రగా అమరావతి విషయం అని చెప్పవచ్చు. అమరావతి రాజధాని విషయం  మరోసారి కూడా  చంద్రబాబును అధికారంలోకి  రాకుండా చేస్తాయని పలు విశ్లేషకులు చెప్తున్నారు.

 ఆయన 2014లో అధికారంలో ఉన్నప్పుడు ఈ రాజధానిని ప్రకటించారు. అయితే అమరావతి రాజధాని రాష్ట్రం నడిబొడ్డున ఉన్నది కాబట్టి  ఆ సమయంలో ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు.  అదే సమయంలో అమరావతి ప్రాంతానికే అన్ని కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల వారికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. కనీసం హైకోర్టు నైనా కర్నూలు తరలిస్తే బాగుండదని వారిలో ఆందోళన  నెలకొంది. కర్నూలుకు హైకోర్టు నివ్వాలని అక్కడి ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. ఒక్కటే అమరావతిని పట్టుకొని హడావిడి చేశారు. ఆ మధ్య కాలంలో  అమరావతి రాజధాని గ్రాఫిక్స్ ను కూడా చూపించారు. కానీ తన పదవీ కాలం పూర్తి అయ్యేసరికి  తాత్కాలిక భవనాలు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నాయి. దాదాపు అన్ని ఆఫీస్ లను అమరావతికే కేటాయించారు.

 ఈ అమరావతి రాజధాని విషయం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలకు మాత్రం  కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయితే జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత  మూడు రాజధానులను ప్రతిపాదించారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతించారు. స్థానిక సంస్థల ఎన్నిక ఫలితాలు దీనికి ప్రధాన నిదర్శనమని చెప్పవచ్చు. అయినా చంద్రబాబు మాత్రం అమరావతి రాజధాని పట్టు విడువ లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అత్యు త్తమ రాజధాని చేస్తాను అంటున్నారు. అయితే  అమరావతి రాజధాని విషయం చంద్రబాబుకు వచ్చే 2024 ఎన్నికల్లో ఇబ్బందిగా మారనుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: