ఆ తెలంగాణ మంత్రి, ఎమ్మెల్యేను టీఆర్ఎస్సే ఓడిస్తుందా ?
దీంతో వీరు ఇప్పుడు అటూ ఇటూ కాకుండా పోయారు. ఈ ముగ్గురు జంపింగ్ లలో సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 16 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కారెక్కేశారు. దీంతో కాంగ్రెస్ సీ ఎల్పీ టీఆర్ ఎస్ లో విలీనం అయ్యింది. ఈ విలీనం వెనక సబిత, సుధీర్ రెడ్డే కీలకంగా వ్యవహరించారు. అందుకే సబితకు మంత్రి పదవి రాగా.. సుధీర్ రెడ్డికి మూసీ డవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవి వచ్చింది. అయితే వీరు పార్టీ మారి పదవులు దక్కించుకున్నా స్థానికంగా వీరిని టీఆర్ ఎస్ కేడర్ తమ పార్టీ నేతలుగా చూడడం లేదు.
ఇటీవల రేవంత్ రెడ్డి పార్టీ మారిన నేతలను కొట్టి చంపాలని అన్నారు. అప్పుడు కేవలం సుధీర్ రెడ్డి మాత్రమే కౌంటర్ ఇచ్చుకున్నారే తప్పా దీనిపై స్థానికంగా ఉన్న టీఆర్ ఎస్ కేడర్ ఎవ్వరూ స్పందించ లేదు. అటు మహేశ్వరం నియోజకవర్గంలో సైతం పాత టీఆర్ ఎస్ కేడర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి కేడర్ సబితకు దూరం దూరంగా ఉంటోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఈ టీఆర్ ఎస్ కేడరే వీరిద్దరిని ఓడించే పరిస్థితి ఉంది.