అన్న బద్ధ శత్రువుతో షర్మిల చెతులు కలిపారా...!
అయితే నాడు ఆంధ్రజ్యోతి, ఈనాడు వైఎస్ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లే కాకుండా.. 2009 ఎన్నికల్లో కూడా వైఎస్‌కు వ్యతిరేకంగా అనేక కథనాలు వండి వార్చాయి. అయినా వైఎస్ రెండో సారి వరుసగా అధికారంలోకి వచ్చారు. ఈనాడు కన్నా కూడా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వైఎస్‌ను, వైఎస్ ఫ్యామిలీని.. ఆ తర్వాత జగన్‌ను ఎక్కువుగా టార్గెట్ చేస్తూ వచ్చాయి. వైస్ కూడా పదే పదే తన ప్రసంగాల్లో ఆ రెండు పత్రికలు అనే వారు... అందుకే మరో మీడియా ఉండాలనే ఆయన సాక్షి కి బీజం వేశారు.
ఇక జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానెల్స్ ఎప్పుడూ జగన్‌ను టార్గెట్‌గా చేసుకునే ప్రచారం చేశాయి. జగన్ అధికారంలోకి వచ్చాక అసలు ఏబీఎన్ మీడియాకు ప్రకటనలే ఇవ్వడం లేదు. ఈ విషయంపై ఆర్కే పదే పదే తన కొత్త పలుకుల్లో మొత్తుకుని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. దీనిని బట్టే జగన్ ఆర్కే విషయంలో ఎంత వ్యతిరేకతతో ఉన్నారో తెలుస్తోంది. అయితే ఇప్పుడు అన్న బద్ధ శత్రువుగా భావించే మీడియాకు చెల్లి షర్మిల అండగా ఉంటున్నారు. ఆర్కేతో ఆమె టచ్‌లో ఉన్నారని కూడా ప్రచారం ఉంది. షర్మిల పార్టీ పెడుతున్నారన్న వార్త ముందుగా ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది.
షర్మిల కొద్ది రోజుల క్రితమే సాక్షి మీడియాలో మా కవరేజ్ రాదని వ్యగ్యంగా అన్నారు. ఈ రోజు వైఎస్సార్ టీపీ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో షర్మిల జ్యోతి పేపర్ మొదటి పేజీకి ఫుల్ యాడ్ ఇచ్చారు. విచిత్రం ఏంటంటే సాక్షికి ఆమె ప్రకటన ఇవ్వలేదు. దీనిని బట్టే అన్న, చెల్లి మధ్య ఉన్న వైరుధ్యం అయితే బయట పడింది. అయితే షర్మిల జ్యోతికి ఇచ్చిన ప్రకటనలో తల్లి విజయలక్ష్మి ఫొటో కూడా లేదు. ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న సంగతి తెలిసిందే..!