కాంగ్రెస్ లోనే ఉంటా.. కానీ గాంధీభవన్లో కూర్చోలేను : కోమటిరెడ్డి
వీరిద్దరిలో టిపిసిసి పదవి ఎవరికి వరించబోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అయితే గత కొన్ని రోజుల పాటు ఇద్దరు ఢిల్లీలోనే ఉండడం మరింత ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇక ఎట్టకేలకు ముందునుంచి అనుకున్నట్లుగానే రేవంత్ రెడ్డి కే టిపిసిసీ పదవిని అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. రేవంత్ రెడ్డి టిపిసిసి పదవికి ఎన్నికైన నాటినుండి అటు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తూ వారందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలే పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు వరకు అందరూ స్పందించి ఇక తెలంగాణ పార్టీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి తో కలిసి పని చేసేందుకు సిద్ధంగానే ఉన్నాము అంటూ ప్రకటించారు.
అయితే అటు కోమటిరెడ్డి మాత్రం టిపిసిసి పదవి దక్కలేదని నిరాశలో ఉన్నారని.. ఇతర పార్టీ లోకి వెళ్ల పోతున్నారు అన్న వార్తలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. అయితే తాజాగా స్పందించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇటీవలే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా భువనగిరి లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి టిపిసిసి 10 రాకపోవడం ఎంతగానో బాధ కలిగించిందన్నారు. అర్హత ఉండి ఇవ్వలేదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఎన్నో పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చాయని కానీ తాను ఏ పార్టీలో కి వెళ్ళకుండా కాంగ్రెస్లోనే కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు కోమటిరెడ్డి. ఇక పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే అందరు నష్టపోతామని.. అంతేకాకుండా గాంధీభవన్లో కూర్చుంటే కెసిఆర్ పై పోరాడ లేము అంటూ వ్యాఖ్యానించారు కెసిఆర్ ని ఓడించాలంటే అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.