ఈట‌ల‌పై పోటీ చేసే టీఆర్ ఎస్ `రేసు గుర్రం` లేదా..?

VUYYURU SUBHASH
తెలంగాణ మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీ కండువా క‌ప్పుకొన్న ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎలాగైనా ఓడించాలి. ఆయ‌న‌పై ప‌ట్టు సాధించాలి. ఈట‌ల‌ను ప‌క్కన పెడుతూ.. ఆయ‌న ఒక అవినీతి ప‌రుడనే ముద్ర వేసిన అధికార పార్టీ టీఆర్ ఎస్ త‌న‌ను తాను నిరూపించుకోవాలి. ఈ క్ర‌మంలో ఈట‌ల‌ను చిత్తుచిత్తుగా ఓడించి తీరాలి!- ఇదీ తెలంగాణ అధికార పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ సంక‌ల్పం. అయితే.. సంక‌ల్పం బాగానే ఉన్నా..క్షేత్ర‌స్థాయి ప‌రిస్తితే బాగాలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేసీఆర్‌కు అత్యంత ప్రియ‌మైన నాయ‌కుడిగా ఉన్న ఈట‌ల‌.. భూవివాదానికి సంబంధించి రాజ‌కీయంగా అనేక మ‌లుపులు ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే టీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. దీంతో ఎమ్మెల్యే ప‌ద‌వికి రిజైన్ చేశారు. ఫ‌లితంగా మ‌రికొన్ని వారాల్లోనే హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ నేప‌థ్యంలో ఈట‌ల‌ను ఓడించి తీరాల‌ని అధికార పార్టీ ల‌క్ష్యంగా నిర్దేశించుకుంది.

అయితే, ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న ఈట‌ల వంటి బ‌ల‌మైన నేత‌ను ఢీకొట్టి విజ‌యం ద‌క్కించుకునే నాయ‌కుడు టీఆర్ ఎస్‌లో లేడ‌ని స్ప‌ష్ట‌మ వుతోంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ఈట‌ల‌పై పోటీ చేసే నాయ‌కుడి కోసం సీఎం కేసీఆర్ వెతుక్కునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే చాలా మంది పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయ‌ని.. అయిన‌ప్ప‌టికీ.. వారికి ఈట‌ల‌పై గెలిచే స‌త్తా.. లేనేలేద‌ని కేసీఆర్ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో హుజూరాబాద్ నుంచి పోటీ చేసే టీఆర్ ఎస్ నేత ఎవ‌రా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ప్ర‌స్తుతానికి కేసీఆర్‌ ప‌రిశీల‌న‌లో ఉన్న పేర్లు..

+ ప్లానింగ్ బోర్డు స్టేట్ వైస్ చైర్మ‌న్ బోయిన‌ప‌ల్లి వినోద్ -  ఈయ‌న పోటీకి విముఖ వ్య‌క్తం చేస్తున్నారు.

+ రిటైర్డ్ ఐఏఎస్ ముద్ద‌సాని పురుషోత్తం రెడ్డి - ఈట‌ల‌కు స‌రైన జోడీ కార‌ని అభ్యంత‌రం

+ క‌శ్య‌ప్ రెడ్డి - ఈయ‌న కూడా ఈట‌ల ముందు క‌ష్ట‌మే.. ప్ర‌జ‌ల్లో సానుకూల‌త లేదు.

+ ఎంపీ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు - కొంత వ‌ర‌కు ఫ‌ర్వాలేదు

+ క‌నుమ‌ల్ల విజ‌య     - అనుకూల‌మే అయిన‌ప్ప‌టికీ.. ఈట‌ల స్థాయి లేదు.

+ మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి - ఈయ‌న ఓకే అంటే.. వ‌ర్క‌వుట్ కావొచ్చు.

+ ముద్ద‌సాని మాలతి - ఈట‌ల ముందు నిలిచే స‌త్తా త‌క్కువే

+ సీఐ పింగ‌ళి ప్ర‌శాంత్ రెడ్డి - డిపాజిట్లు ద‌క్క‌డం కూడా క‌ష్ట‌మే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: