చేయి ఎత్తితే బస్సు ఆపాలి.. ఆర్టీసీ కీలక నిర్ణయం?
మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఇక తాము దిగాల్సిన ప్లేస్ వచ్చినప్పటికీ ఇక బస్ స్టాప్ లోనే బస్ ఆగుతుంది కాబట్టి ఇక అక్కడ దిగి మళ్ళీ ఒంటరిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ఆకతాయిల నుంచి వేదింపులు ఎదుర్కొంటూ ఉంటారు మహిళలు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఇటీవలే హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు మహిళల భద్రత కోసం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ జూన్ టీఎస్ ఆర్టీసీ అధికారులు. ఇక నుంచి రాత్రి సమయంలో మహిళలు ఎక్కడైనా చేయి ఎత్తితే చాలు బస్సు ఆపాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు
రాత్రి ఏడున్నర గంటల తర్వాత మహిళలు స్టేజిల మధ్య ఎక్కడ ఉన్నా చెయ్ ఎత్తితే చాలు ఇక బస్ ఆపాలంటూ కండక్టర్లు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు ఇక వారు కోరిన చోట బస్సు ఆపి వారు దిగేందుకు సహకరించాలని టిఎస్ఆర్టిసి హైదరాబాద్ జోన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలా మహిళలకు రాత్రి సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఇటీవల ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ జోన్ అధికారులు తీసుకున్న నిర్ణయంతో మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది అని చెప్పాలి.