పెళ్లికి వెరైటీ గిఫ్ట్.. కరోనా టైం లో ఇది మస్ట్?
ఇలా వెరైటీ గిఫ్ట్ లు ఇచ్చిన ఘటనలు కాస్త అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి అందరినీ అవాక్కయ్యేలా చేస్తూంటాయి. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఎంత కీలకంగా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మొన్నటివరకు కరోనా వైరస్ కారణంగా ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ ఈ క్రమంలోనే ఆక్సిజన్ విలువ ఏంటి అని ప్రస్తుత సమయంలో అందరికీ తెలిసి వచ్చింది. కరోనా టైంలో బాగా ఉపయోగపడాలి అనుకున్నారో ఏమో ఒక వెరైటీ గిఫ్ట్ వధూవరుల్ని షాక్ కి గురి చేసారు.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని కి చెందిన ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించి తమ కూతురు పెళ్లిలో వరుడికి కానుకగా 2 ఆక్సిజన్ కాన్సెంట్రేట్ లను అందజేసింది. అయితే వధువు కుటుంబం ఈ రెండు కాన్సంట్రేటర్ల కోసం 1.43 లక్షలు ఖర్చు చేసింది. ఇక ఇలాంటి బహుమతితో నూతన వధూవరులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత సంతోషపడ్డారు. అయితే ప్రస్తుత సమయంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరికైనా అవసరం అయితే ఉచితంగానే అందజేస్తాము అంటూ నూతన వధూవరులు చెప్పుకొచ్చారు.