పోలవరం ప్రాజెక్టుతో మూడు లక్షల మందికి ప్రమాదమా...?

MOHAN BABU
పోలవరం జాతీయ ప్రాజెక్టుతో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినటువంటి మూడు లక్షల మంది ప్రజలకు జల సమాధి అయ్యే ప్రమాదం ఉన్నదని సి పి ఐ ఎం  కేంద్ర కమిటీ సభ్యులు  ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఈ మధు అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడాలన్నారు.  పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న ప్రజలకు  పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు  మొండి వైఖరితో ఉన్నాయని తెలియజేసారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కంటే ముందుగానే నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని తెలిపారు. నిర్వాసితుల సమస్యలపై  ఈ నెల 5వ తేదీన విజయవాడలో  అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన  దీక్ష చేపడతామన్నారు.
 ముంపు ప్రాంతం మండల కేంద్రాల్లో  నిరసన దీక్షలు చేపడతామని తెలిపారు. భద్రాచలం దేవాలయం మునిగితే చూస్తూ ఊరుకోమని  అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల ప్రభుత్వాలకు మానవత్వం కూడా లేదని అన్నారు. ఈ ప్రాజెక్టులపై ప్రజల మధ్యలో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి  మొండి విధానాలను  ఎండగడతాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేక పోయారన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెలంగాణ పిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పోదాం వీరయ్య మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల ప్రజలను పోలవరం ప్రాజెక్ట్ పేరుతో జల సమాధి చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి అఖిలపక్ష  రాష్ట్ర కన్వీనర్  జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య  దొర  అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య,  జ్యోతుల నెహ్రూ, వంతల రాజేశ్వరి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు  కాసాని అయిలయ్య, రాజేష్ సిపిఎం ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు రంగారెడ్డిలు ఉన్నారు.
కరోణ వ్యాధి నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  విఫలమయ్యాయని, ప్రభుత్వ వైద్య రంగాన్ని బలహీన పరుస్తున్నారు అని ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఈ మధు అన్నారు. పోలవరం ప్రాజెక్టు  ప్రభుత్వాలన్ని నిర్వాసితులను ఆదుకోవడంలో విఫలం  అయ్యారని తెలిపారు. రాబోవు రోజుల్లో ఈ ప్రాజెక్టుతో  మూడు లక్షల మంది ముప్పు వాటినుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: