అమెరికా మోసం.. ఆఫ్ఘన్ ను నిండా ముంచేసింది?

praveen
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు బైడెన్.  ఆఫ్ఘనిస్తాన్ లోని కీలక మైనటువంటి బేస్ ను 20 సంవత్సరాల క్రితం అమెరికా స్వాధీనం చేసుకుని అక్కడ వారి సైనిక స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకుంది.  కేవలం ఒకే చోట కాదు దాదాపు ఐదు చోట్ల స్థావరాలను 20 సంవత్సరాల కింద ఏర్పాటు చేసుకుంది అమెరికా. అయితే అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాన్ని పూర్తిస్థాయి సామర్థ్యంతో అభివృద్ధి చేసుకుంది.

 శత్రువులు ఆ స్థావరం పై కూడా దాడి చేసేందుకు భయపడే విధంగా ఆ స్థావరాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసింది అమెరికా.  అయితే అలాంటి స్థావరాన్ని ప్రస్తుతం 20 ఏళ్ల తర్వాత అమెరికా అటు ఆఫ్ఘనిస్తాన్కు అప్పగిస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. అయితే ఇలా 20 ఏళ్ల నాటి సైనిక స్థావరాన్ని అమెరికా ప్రస్తుతం తమ దేశానికి అప్పగించడాన్ని మాత్రం ఆఫ్ఘనిస్తాన్  ప్రభుత్వం వ్యతిరేకించింది. తాలిబన్లు మాత్రం స్వాగతించారు. అయితే ఈ స్థావరాన్ని ఆఫ్ఘనిస్తాన్ కు ఈ సమయంలో  అమెరికా అప్పగించడం మాత్రం మోసం లాంటిది అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి ఆప్ఘనిస్థాన్లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకుంటున్నారు.


 ఇలాంటి సమయంలో ఇక కీలకమైన అటువంటి బేస్ అటు ఆఫ్ఘనిస్తాన్కు అప్పగిస్తే తాలిబన్లు అది కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని దీంతో ఇక తాలిబన్ల అరాచకాలు మరింత మితిమీరి పోయే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.  ఒకవేళ ఇటీవల అమెరికా అప్పగించిన కీలకమైన బేస్ కాపాడుకోవాలంటే దాదాపు ఆఫ్గనిస్థాన్ సైన్యాన్ని మొత్తం అక్కడ ఆమోదించాల్సిన అవసరం ఉంటుందట. అలా జరిగితే ఇక దేశం మొత్తాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు . ఇలా అమెరికా తీసుకున్న నిర్ణయం ఆఫ్ఘనిస్తాన్ ను  నిండా ముంచేసే లాగే ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: