ఉత్తరాఖండ్ కొత్త సిఎం.. ఎవరు ఈ పుష్కర్ సింగ్ దామీ?
అయితే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ దామి ఎన్నికైన నాటినుండి ఇక ఆయన గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పుష్కర సింగ్ దామి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం... రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఎంతో సన్నిహితుడుగా ఉన్నారు పుష్కర్ సింగ్ దామి. 1975 సెప్టెంబర్ 16న జన్మించారు. లక్నో యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేశారు. ఉద్దవ్ సింగ్ నగర్ జిల్లాలోని ఖాతిమ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు పుష్కర్ సింగ్.
ఇక ఆ తర్వాత బీజేపీలో ఎంతో కీలక నేతగా మారిపోయారు. తనదైన రాజకీయ చతురతతో ఎంత గానో గుర్తింపు సంపాదించారు ఇప్పుడు ఉత్తరాఖండ్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎన్నుకోబడ్డారు. అయితే ఉత్తరాఖండ్లో ఇప్పుడే కాదు ఎప్పుడూ రాజకీయ అస్థిరత నెలకొంటుంది. అయితే కేవలం నాలుగు నెలల సమయంలోనే ముగ్గురు సీఎంలు మారడం సంచలనంగా మారిపోయింది. ఇలా ఉత్తరాఖండ్లో అనూహ్య రాజకీయా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు ఇప్పటివరకు 20 సంవత్సరాలు కాగా.. గత 20 సంవత్సరాలలో ఏకంగా పది మంది సీఎం లు పని చేసారు. ఇలా ఉత్తరాఖండ్ కు ఎప్పుడు రాజకీయం అస్థిరత నెలకొంటూనే ఉంటుంది .