పాతబస్తీలో బాంబుల కంపెనీలు .. రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఇటీవలే సికింద్రాబాద్ నుంచి బీహార్ వెళ్లిన పార్సిల్  ఘటనపై పోలీసులు విచారణ జరపగా సంచలన విషయాలు బయట పడ్డాయి. ఈ కేసులో ఏకంగా ఆసిఫ్ నగర్ కు చెందిన ఇద్దరు పోలీసులను అరెస్టు చేశారు పోలీసులు. ఇందులో ఒకరు పాకిస్తాన్ లో శిక్షణ పొంది వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. సికింద్రాబాద్లో పార్సిల్ బుక్ చేసిన పేరు మీదే అటు రిసీవర్ పేరు కూడా ఉండడం గమనార్హం.



 మహమ్మద్ సుఫియాన్ హర్షద్ పేరుమీద సికింద్రాబాద్ లో పార్సెల్ బుక్ అయింది.అయితే ఇక దర్భంగ్ సుఫియాన్ పేరుమీదే రిసీవర్ కూడా ఉండడం గమనార్హం. రిసీవింగ్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్ బాంబు బ్లాస్టింగ్ జరిగిన సమయంలో దర్భంగ్ స్టేషన్ లోనే లొకేషన్ చూపించడం మరింత సంచలనంగా మారింది. అయితే ఇలా హైదరాబాద్ నగరంలో బాంబు బ్లాస్టింగ్ సంబంధించి కీలక విషయాలు బయటపడడంతో దీనిపై ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ ఐఎస్ఐ అడ్డాగా మారిందని విమర్శలు గుప్పించారు. దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో పేలుళ్లు జరిగినా దానికి సంబంధించిన ఆనవాళ్లు  హైదరాబాద్లో బయటపడుతున్నాయి అంటూ విమర్శలు గుప్పించారు రాజా సింగ్.



 టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ఎంఐఎం పార్టీ తో ఒక్కటైనా తర్వాత  ఓల్డ్ సిటీ కాస్త బాంబు ఫ్యాక్టరీ గా మారిపోయింది అంటూ సంచలన విమర్శలు చేశారు రాజా సింగ్. అయితే హైదరాబాద్ నగరంలో ఇంత తతంగం నడుస్తూ ఉంటే అటు హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోంది అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ కి ఎంత మంది వెళ్తున్నారు.. ఇలాంటి వారు ఇంకా ఎంతోమంది హైదరాబాదులో ఉన్నారు అంటూ ఇంటిలిజెన్స్ విభాగాన్ని ప్రశ్నించారు. పాకిస్తాన్ నుండి వచ్చి ఇక్కడ కుట్ర చేస్తుంటే ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు నిఘా పెట్టలేకపోయింది అంటూ ప్రశ్నించారు. అరెస్ట్ అయిన వివరాలు బయటకు చెప్పకుండా పోలీసులు ఎందుకు దాస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.  పూర్తి వివరాలను వెల్లడించాలని అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: