14 ఏళ్ల బాలుడు చేసిన కొంటె పని.. పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది?
సాధారణంగా పోలీసులకు అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి అన్నది తెలిసిందే. సేమ్ సినిమాల్లో చూపించినట్లు గానే ఎవరో ఆకాశరామన్న ఫోన్ చేసి అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని లేదా బాంబు ఉంది అంటూ పోలీసులకు చెబుతూ ఉంటారు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు చెప్పి భయబ్రాంతులకు గురి చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో అక్కడ బాంబు పేలుళ్లు జరగ కుండా ఉండేందుకు పోలీసులు పరుగులు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒక 9వ తరగతి విద్యార్థి చేసిన కొంటె పని పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది.
ఇటీవలే తాజ్ హోటల్ కు ఫోన్ చేసిన ఆ తొమ్మిదవ తరగతి విద్యార్థి.. ఇద్దరు ఉగ్రవాదులు తాజ్ హోటల్ లోకి వస్తున్నారు అంటూ ఒక కాల్ చేసాడు. ఇక ఉగ్రవాదులు వస్తున్నారు అని చెప్పడంతో తాజ్ హోటల్ సిబ్బంది భయంతో వణికిపోయారు. ఒక్క క్షణం వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలోనే ఇక అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇక తాజ్ హోటల్ కు పరుగులు పెట్టారు. ఏకంగా బాంబు స్క్వాడ్ తో రంగంలోకి దిగి బాంబును వెతకడం మొదలు పెట్టారు. కానీ ఆ తర్వాతే అసలు విషయం తెలిసింది. ఇక ఆ హోటల్ కి వచ్చిన ఫోన్ కాల్ ఫ్రాంక్ అని.. సతారా జిల్లాలో నుంచి ఒక 9వ తరగతి కుర్రాడు ఈ కాల్ చేసినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని మందలించారు పోలీసులు.