
దిశయాప్‌పై మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహనః జగన్
ఏపీలో మహిళలకు జగన్ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇక ఇదే క్రమంలో ఈ రోజు హోంమంత్రి మేకతోటి సుచరితతో పాటు డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎంఓ అధికారులతో మహిళల భద్రతపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు జగన్. అలాగే దిశ యాప్‌పై పూర్తి అవగాహన కలిగించాలన్నారు.
దాన్ని ఎలా వాడాలనే దానిపై పూర్తి అవగాహన మహిళలకు కలిగించాలని జగన్ చెప్పారు. అలాగే ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసేలా చూడాలన్నారు. ఇక గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులతో పాటు వాలంటర్లతో అక్క చెల్లెమ్మలకు దిశ యాప్‌పై అవగాహన కలిగించాలన్నారు.
దానికంటే ముందుగా మహిళా పోలీసులకు, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చిన తర్వాత వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు యాప్‌పై పూర్తి అవగాహన కలిగించాలని సూచించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్న విషయంపై అక్క చెల్లెమ్మలకు వివరించాలని, ఈ ప్రోగ్రమ్‌ను ఒక
దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశం ఇచ్చారు.
ఇక కాలేజీలు, విద్యాసంస్థల్లో కూడా స్టూడెంట్లకు ఈ యాప్‌వినియోగంపై అవగాహన కలిగించాలని సూచించారు సీఎం జగన్. ఈ చర్యల ద్వారా దిశ యాప్ వినియోగం క్రమంగా పెరుగుతుందన్నారు. అలాగే అక్క చెల్లెమ్మలను ఆదుకునేలా ఆ విధంగా వెనువెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. దిశ పోలీస్‌స్టేషన్లు, స్థానిక పోలీస్‌స్టేషన్లు వెంటనే స్పందించేలా చూడాలన్నారు. ఇక పోలీస్ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌వాహనాలను వెంటనే సమకూర్చాలని సీఎం జగన్ చెప్పారు. ఏ మాత్రం ఆలస్యం కూడా జరగకుండా చూడాలని, ఏమైనా తేడా వస్తే సహించేది లేదన్నారు. ప్రతి ఫిర్యాదుపై వెంట వెంటనే స్పందించాలని జగన్ చెప్పారు. ఇక ఏదైనా అవసరం వస్తే వెంటనే అడగాలని, నిర్లక్ష్యం మంచిది కాదని చెప్పారు.